విజయానికి దూరంగా.. ‘‘వి’’.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

V-Movie Review: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా టాలెంటెడ్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీ స్టారర్‌గా రూపొందిన సినిమా ‘వి’. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్‌గా నటించారు. ఇన్నాళ్ళూ థియేటర్స్ ఓపెన్ అవుతాయని ఎదురుచూసినా మేకర్స్ అందుకు ఇంకా సమయం పడుతుండటంతో తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల‌ను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.


కథ విషయానికొస్తే…
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు జరుగుతున్న సమయంలో అక్కడికెళ్లి 30 మందిని ప్రాణాలతో బయట పడేసినందుకుగాను డీసీపీ ఆదిత్య (సుధీర్ బాబు)ను ప్రభుత్వం ‘శౌర్య’ పతకంతో సత్కరిస్తుంది. ఈ క్రమంలో అపూర్వ (నివేధా) ఆదిత్య కథ రాయడానికి వచ్చి ఇంప్రెస్ అయి అతనితో ప్రేమలో పడుతుంది. ఇంతలో ఆదిత్య జీవితంలోకి విష్ణు (నాని) ఎంట్రీ ఇస్తాడు. ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ అనే అతన్ని చంపి మరో నలుగురును చంపుతా.. దమ్ము ఉంటే ఆపు అంటూ ఆదిత్యకి ఛాలెంజ్ విసురుతాడు. ఈ క్రమంలో ఆదిత్య విష్ణు ఛాలెంజ్‌ని ఎలా తీసుకున్నాడు.. విష్ణు హత్యలు చేయకుండా ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. విష్ణు ఇంత దారుణంగా ఎందుకు హత్యలు చేస్తున్నాడు..విష్ణు, ఆదిత్యల మధ్య జరిగిన వార్‌లో చివరికి ఎవరు నెగ్గారు అన్నది మిగిలిన కథ.నటీనటుల పెర్ఫార్మెన్స్…
విష్ణు, ఆదిత్యలుగా నాని.. సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. ఇద్దరు కలిసి నటించిన సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్‌లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోటీపడి నటించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నాని తన నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో కట్టిపడేశాడు. నివేదా థామస్, అదితీ రావు హైదరి తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నీషియన్స్…
అమిత్ త్రివేది మ్యూజిక్ సో సో గా ఉన్నప్పటికీ రెండు పాటలు బాగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయింది. ఎడిటింగ్ బాగున్నప్పటికి ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ బాగా లాగ్ అయ్యాయి. వాటిని ఇంకాస్త ట్రిమ్ చేస్తే ఆడియన్స్ బోర్ ఫీలయ్యే వారు కాదు. పి.జి.విందా సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. యాక్షన్ సీన్స్ అద్భుతంగా చిత్రీకరించాడు. నిర్మాత దిల్ రాజు సినిమాని చాలా రిచ్‌గా నిర్మించాడు.ఓవరాల్‌గా…
ఫస్టాఫ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నాని తన పెర్ఫార్మెన్స్‌తో ఎప్పటిలాగే ఆకట్టుకున్నాడు. అయితే నాని పోషించిన నెగిటివ్ రోల్ అంతగా యాప్ట్ కాలేదు. ఇక సుధీర్ బాబు కూడా పోలీస్ ఆఫీసర్‌గా పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. యాక్షన్ సీన్స్‌లో మరోసారి సుధీర్ బాబు తన సత్తా చూపించాడు. సెకండాఫ్‌లో కనుక లాగ్ లేకపోయి ఉంటే జనాలు బాగా కనెక్ట్ అయ్యేవారు. కొన్ని సీన్స్ బాగా లాగ్ ఉండటంతో అక్కడక్కడా బోర్ ఫీలవుతున్నారు. క్లైమాక్స్‌లో నాని పెర్ఫార్మెన్స్ బావుంది. ఫైనల్‌గా లాజిక్స్ వెతుక్కోకపోతే ఒకసారి చూడవచ్చు.ప్లస్ పాయింట్స్…
నాని నేచురల్ స్టార్ అన్న పేరుకు తగ్గట్టు ఈ సినిమాలో తన పాత్రలో ఒదిగిపోయి నటించాడు. ముఖ్యంగా నాని నటన సినిమాకి పెద్ద ప్లస్ అని చెప్పాలి. అలాగే సుధీర్ బాబు నానిల మధ్య వచ్చే సీన్స్ ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించడం మరో ప్లస్ పాయింట్. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకి ప్రధాన బలం. ఈ సీన్స్‌లో నాని, సుధీర్ బాబుల టైమింగ్ బాగా కుదిరింది. నివేదా థామస్, అదితిరావు హైదరిల గ్లామర్ కూడా ప్లస్ పాయింట్. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కాస్త రిలీఫ్ ఇస్తుంది. ఇక ఇప్పటి వరకు తీసిన సినిమాలన్ని ఒకెత్తైతే ‘వి’ సినిమా మరో ఎత్తు అనేలా డిఫరెంట్ జోనర్‌లో ప్రజెంట్ చేశాడు దర్శకుడు.మైనస్ పాయింట్స్…
ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఎంచుకున్నది మంచి పాయింట్ అయినప్పటికి పూర్తిగా ఆ పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేయడంలో తడబడ్డాడు. ముఖ్యంగా లాజిక్‌కి దూరంగా అల్లుకున్న సీన్స్ ఆడియెన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. ఇక రివేంజ్ డ్రామాలో ఇద్దరి హీరోలకి లవ్ ట్రాక్స్ పెట్టడం కథని బాగా వీకయ్యేలా చేసింది. క్రైమ్ కథలు రాయడానికి వచ్చిన కాలేజీ టాప్ స్టూడెంట్ నివేధా సుధీర్ బాబుతో లవ్‌లో పడే సీన్స్ మరీ సిల్లీగా అనిపిస్తాయి. నివేదా రీసెర్చ్ చేయడం కూడా ఆకట్టుకునే విధంగా సాగదు.
ఇక నాని – అతిధి మధ్య ఉన్న లవ్ ట్రాక్‌లో కొత్తదనం కనిపించదు. ఇది పెద్ద మైనస్ అని చెప్పాలి. సినిమాని ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టినప్పటికి స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగి బోర్ కొట్టే విధంగా అనిపిస్తుంది. నాని, ఇంద్రగంటి సినిమాలో సాంగ్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో ఆ అవకాశం లేకుండా పోయింది.
అలాగే లాజిక్ లేని సీన్స్‌తో పాటు కొన్ని సీన్స్ ఆసక్తికరంగా అనిపించకపోవడం మరో మైనస్. ఇంద్రగంటి సినిమా అని ఫీలయిన వాళ్ళకి కాస్త నిరాశ తప్పదు. సస్పెన్స్, ఎమోషనల్ సీన్స్‌తో ఆకట్టుకున్నా.. పూర్తి స్థాయిలో మాత్రం ‘వి’ ఆకట్టుకోలేకపోయింది.
ఫైనల్‌గా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త లాగ్ అండ్ బోర్… విజయానికి దూరంగా నిలిచిన “వి”..

Related Tags :

Related Posts :