Vaccine to prevent COVID-19 will take long time to be ready

కరోనా వ్యాక్సిన్‌ ఇప్పట్లో రాదు, మరికొన్నేళ్లు పోరాటం చేయాల్సిందే, కిరణ్ మజుందార్ షా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికుతోంది. ప్రజలు ప్రాణభయంతో బతుకున్నారు.

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వణికుతోంది. ప్రజలు ప్రాణభయంతో బతుకున్నారు. ఇప్పటికే లక్షల మంది కరోనా బారిన పడ్డారు. లక్షల సంఖ్యలో చనిపోయారు. ఇంకా ఎంతమందిని కరోనా బలి తీసుకుంటుందో తెలీదు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ పై ఆశలు పెట్టుకుంది. వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో అంతా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వ్యాక్సిన్ వస్తుందని, ఏ ఏడాది చివరికల్లా రానుందని కొన్ని దేశాలు చెప్పడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. హమ్మయ్య ఇక భయం లేదు, కరోనా గండం తప్పినట్టే అని కొంత రిలాక్స్ అయ్యారు. ఈ పరిస్థితుల్లో బయో టెక్నాలజీ కంపెనీ బయోకాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ రావడానికి చాలాకాలం పట్టొచ్చు:
కరోనా వైరస్‌ నిర్మూలన కోసం సురక్షితమైన వ్యాక్సిన్‌ రావడానికి చాలాకాలం పట్టొచ్చని కిరణ్‌ మజుందార్‌ షా అన్నారు. ఈ మహమ్మారితో మరికొన్నేళ్లు పోరాడక తప్పదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. హెల్త్‌కేర్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడుల అవసరం ఉందని చెప్పారు. శనివారం(మే 30,2020) కార్ప్‌గిని నిర్వహించిన ఓ వెబినార్‌లో షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మా-హెల్త్‌కేర్‌ రంగాలు, అనిశ్చిత పరిస్థితుల్లో వినియోగదారులతో మమేకం, కొవిడ్‌-19 అనంతర వ్యాపార విధానం అంశాలపై చర్చించారు. 

మందు అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగైదేళ్లు:
‘కరోనా వైరస్‌ నియంత్రణ వ్యాక్సిన్‌ రావడానికి చాలా కాలమే పడుతుందని మనం నమ్మాలి. ఇక యావత్‌ దేశానికి ఇది అందుబాటులోకి రావాలంటే మరెంతో సమయం కావాలి. వ్యాక్సిన్‌ అభివృద్ధి ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ అని మనం అర్థం చేసుకోవాలి. మందు అందుబాటులోకి రావడానికి కనీసం నాలుగైదేళ్లు పడతుంది’ అని షా అన్నారు. ఈ క్రమంలోనే ఏడాదిలోగా వ్యాక్సిన్‌ను తీసుకురావడం చాలా కష్టమన్నారు. వ్యాక్సిన్‌ ఆవిష్కరణను రక్షణ, సామర్థ్యం, ఓర్పుతో కూడిన ప్రక్రియగా అభివర్ణించారు.

ఒకేరోజు 8వేలకుపై కరోనా కేసులు, భారత్ లో ఇదే తొలిసారి:
భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8వేల 380 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒకే రోజు 193 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,164కు చేరింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష 82వేల 143కి చేరింది. ఈ వైరస్‌ నుంచి 86,984 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మన దేశంలో కరోనా కేసులు వెలుగులోకి వచ్చాక ఒకేరోజులో 8వేలకుపైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

READ  ఆరు నెలల కరోనా.. భారత్ ఏం చేసింది? 24 గంటల్లో 52 వేలకు పైగా కేసులు..

మహారాష్ట్రంలో 65వేల కరోనా కేసులు:
* మన దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 65వేల 168 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 2,197 మంది చనిపోయారు. 
* తమిళనాడులో 21,184, ఢిల్లీలో 18,549, గుజరాత్‌లో 16,356, రాజస్థాన్‌లో 8,617, మధ్యప్రదేశ్‌లో 7,891, యూపీలో 7,701, బెంగాల్‌లో 5,130, బీహార్‌లో 3,565, ఏపీలో 3,461, కర్ణాటకలో 2,922, తెలంగాణలో 2,499 కేసులు నమోదయ్యాయి.
* జమ్మూకశ్మీర్‌లో 2,341, పంజాబ్‌లో 2,233, హర్యానాలో 1,923, ఒడిశాలో 1,819, అసోంలో 1,217, కేరళలో 1,209, ఉత్తరాఖండ్‌లో 749, జార్ఖండ్‌లో 563, ఛత్తీస్‌గఢ్‌లో 447, హిమాచల్‌ప్రదేశ్‌లో 313, ఛండీఘర్‌లో 289, త్రిపురలో 271, లడఖ్‌లో 77, గోవాలో 70, మణిపూర్‌లో 60, పుదుచ్చేరిలో 57 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
* నాగాలాండ్‌లో 36, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 33, మేఘాలయలో 27, అరుణాచల్‌ప్రదేశ్‌లో 3, మిజోరాం, సిక్కింలో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 61లక్షల కరోనా కేసులు, 3లక్షల 70వేల మరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండం కొనసాగుతోంది. ఇప్పటివరకు 61 లక్షల 54 వేల 35 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 48 వేల 505. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 70 వేల 893 మంది చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని 27 లక్షల 34 వేల 637 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా వైరస్‌ కారణంగా అగ్రరాజ్యం అమెరికా అత్యంత ప్రభావానికి గురవుతోంది. కోవిడ్‌-19తో అమెరికాలో గడిచిన 24 గంటల్లో 960 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం లక్ష 5వేల 557 మంది చనిపోయారు. 18 లక్షల 16 వేల 820 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 

కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు:
బ్రెజిల్‌-28,834, రష్యా-4,555, స్పెయిన్‌-27,125, యూకే-38,376, ఇటలీ-33,340, ఫ్రాన్స్‌-28,771, జర్మనీ-8,600, టర్కీ-4,515, ఇరాన్‌-7,734, పెరూ-4,371, కెనడా-7,073, చైనా-4,634, మెక్సికో-9,779, పాకిస్థాన్‌-1,395, బెల్జియం-9,453, నెదర్లాండ్స్‌-5,951, ఈక్వెడార్‌-3,334, స్వీడన్‌-4,395, పోర్చుగల్‌-1,396, స్విర్జర్లాండ్-1,919, ఐర్లాండ్‌-1,651, ఇండోనేషియా-1,573, పోలాండ్‌-1,061, రోమేనియా- 1,259 మరణాలు.

Related Posts