కరోనాని ఆపడానికి వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదు : WHO చీఫ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Vaccine Will Not Be Enough To Stop Pandemic వ్యాక్సిన్ ఒక్కటే కరోనావైరస్ మహమ్మారిని నిలువరించలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)చీఫ్ అథనామ్ టెడ్రోస్ అథనామ్ గేబ్రియెసస్ తెలిపారు. ఒక వ్యాక్సిన్.. మన దగ్గర ఉన్న ఇతర టూల్స్(సాధనాలు)ని పూర్తి చేస్తుంది కానీ వాటిని భర్తీ చేయదని టెడ్రోస్ తెలిపారు. వ్యాక్సిన్ ఒక్కటే కరోనా మహమ్మారిని అంతం చేయలేదని అన్నారు.అదేవిధంగా,వ్యాక్సిన్ సరఫరా ప్రారంభంలో ఆంక్షలు ఉంటాయని టెడ్రోస్ తెలిపారు. మొదట హెల్త్ వర్కర్లకు,వృద్ధులకు, రిస్క్ ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆ విధంగా చేయడం ద్వారా కరోనా మరణాల సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపారు.మరోవైపు,కరోనా విషయంలో జాగ్రత్తలు పాటించాలని టెడ్రోస్ హెచ్చరించారు. తనిఖీ కొనసాగాలని,టెస్ట్ ల సంఖ్య పెరగాలని తెలిపారు. ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.మరోవైపు, ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ ‘మోడెర్నా’ సోమవారం కీలక ప్రకటన చేసింది. తాము అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్…కరోనాని నిరోధించడంలో 94.5 శాతం ప్రభావవంతంగా ఉందని వెల్లడించింది. దాదాపు 30వేల మందిపై క్లినికల్ ట్రయల్ పూర్తి చేసిన తరువాత మోడెర్నా ఈ విషయాన్ని ప్రకటించింది. . కోవిడ్ -19 వ్యాధిని ఆపడంతో తాము డెవలప్ చేస్తోన్న టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని మోడెర్నా CEO చెప్పారు.కాగా,ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 5.5కోట్లకు చేరువలో ఉండగా,మరణాల సంఖ్య 13లక్షలు దాటింది. అత్యధికంగా అమెరికాలో కోటి 10లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా,2లక్షల 46వేల మంది అమెరికన్లు కరోనాతో మరణించారు. కరోనా కేసుల విషయంలో అమెరికా తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 88లక్షలు దాటింది. భారత్ లో 1లక్షా 30వేల మంది కరోనాతో కన్నుమూశారు.

Related Tags :

Related Posts :