లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

గుజరాత్ లో ఘోర ప్రమాదం 11 మంది మృతి, దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని

Published

on

accident

Vadodara road accident : గుజరాత్ రాష్ట్రంలోని వడోదర నగరంలో ఘోర ప్రమాదం సంభవించింది. 2020, నవంబర్ 19వ తేదీ బుధవారం తెల్లవారజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించగా..16 మందికి గాయాలయ్యాయి. ఘటనపై భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.senior police official RB Brahmbhatt కథనం ప్రకారం…వగోడియా సర్కిల్ వద్ద..మినీ ట్రక్ ను మరొక ట్రక్కు ఢీకొందన్నారు. Bhavnagar to Pavagarh వైపు ఓ ట్రక్కు వెళుతోందని, అందులో 26 మంది ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. పంమహల్ జిల్లా వైపు మరో ట్రక్కు వెళుతోందన్నారు. ఇరు ట్రక్కులు ఢీకొన్నాయని, దీంతో 11 మంది చనిపోయారన్నారు. మరణించిన 11 మందిలో 9 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఒక చిన్న పిల్లవాడు ఉన్నారని తెలిపారు. మృతులు సూరత్ నగరానికి చెందిన వారుగా గుర్తించినట్లు, క్షతగాత్రులను వడోదరలోని ఎస్ఎస్‌జి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వడోదర కలెక్టర్, ఎస్పీలు ఘటనాస్థలిని పరిశీలించారు. అధికారులతో మాట్లాడిన సీఎం..ఓ ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదం జరగడం బాధాకరమని, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. మరణించిన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *