లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

Vaishno Devi Yatra, ఆన్ లైన్ లో హెలికాప్టర్ బుకింగ్

Published

on

జమ్మూ కాశ్మీర్ లోని చారిత్రాత్మక వైష్ణోదేవి ఆలయ యాత్రకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. హెలికాప్టర్ బుక్ చేసుకోవచ్చని, ఆగస్టు 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 05వ తేదీ వరకు ఈ సదుపాయం అమల్లో ఉంటుందని మాత వైష్ణోదేవి ఆలయ బోర్డు సీఈవో రమేశ్ కుమార్ జంగిద్ తెలిపారు.కత్రా దగ్గరిలో ఉన్న వైష్ణో దేవి ఆలయాన్ని కరోనా కారణంగా..మార్చి 18వ తేదీన ఆలయాన్ని మూసివేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రార్థనాస్థలాల తెరవడంపై జమ్మూ కాశ్మీర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ చేయాలని ఆగస్టు 11వ తేదీన నిర్ణయం తీసుకోవడంతో..ఆగస్టు 16వ తేదీన వైష్ణోదేవి యాత్ర ప్రారంభమైంది.

వాహ్..!!వర్షం కురిస్తే కనువిందు చేసే అద్భుతం..ప్రధాని షేర్ చేసిన వీడియో


కానీ..ఫస్ట్ వీక్ లో 2 వేల మంది భక్తులే వచ్చారని, వీరిలో 1900 మంది జమ్మూ కాశ్మీర్ వాసులు. కేవలం 100 మంది ఇతర రాష్ట్రాల వాళ్లున్నారు. కొన్ని నిబంధనల ప్రకారం యాత్ర కొనసాగనుంది.యాత్రకు 10 ఏళ్లలోపు, 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారిని, గర్భవతులను అనుమతించడం లేదు. కచ్చితంగా మాస్క్ ధరించాలి. రాత్రి వేళ జర్నీలకు అనుమతినివ్వరు. ఆలయంలో ఉదయం నిర్వహించే హారతికి భక్తులను హాజరు కానివ్వడం లేదు. ఆలయం దగ్గర కరోనా టెస్టులు నిర్వహస్తున్నారు. అందులో నెగటివ్ వస్తే..ఆలయం లోపలకు అనుమతినిస్తారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *