Valentine's Day 2020: restricted in these countries

Feb 14- వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ నిషేదం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచమంతా ప్రేమమయం. రోజాలతో వాలెంటైన్‌ను కలుసుకుని స్వేచ్ఛా విహంగాలతో ప్రేమను పంచుకునే రోజు. ఈ వేడుకలు అన్ని చోట్లా జరుగుతాయని అనుకోవడానికి లేదు. కొన్ని చోట్ల వాలెంటైన్స్ డే వేడుకలపై నిషేధం విధించడం గమనార్హం. ఇరాన్, పాకిస్థాన్ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం వేడుకలను నిషేధించారు.

ఇరాన్ లో ఎక్కడైనా వాలెంటైన్స్‌డే వేడుకలను జరుపుకుంటే నేరంగానే భావిస్తామని చెప్పారు. రాజధాని టెహ్రాన్ నగరంలోని కాఫీ, ఐస్ క్రీమ్ షాపులకు నోటీసులు జారీ చేశారట. అంతేకాకుండా షాపులో చేరి వాలెంటైన్స్ డే గిఫ్టులు ఒకరికొకరు ఇచ్చుకోకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
 
ఇటు పాకిస్థాన్‌లో గతేడాదే అప్పటి దేశాధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్.. పాకిస్తానీలెవరూ వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకోవద్దని, అది ఇస్లాం సంస్కృతి కాదని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా పశ్చిమ సంస్కృతులను గుడ్డిగా పాటించడం వల్ల ఇస్లాం సంస్కృతి సంప్రదాయాలు నాశనమైపోతాయని, మహిళలపై దాడులతో పాటు ఇంకొన్ని సమస్యలకు కారణం అవుతాయని ఆ దేశాల అధినేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
 

Related Posts