Valentine's Day Upasana Viral Tweet..Love yourself

ప్రేమికుల రోజు ఉపాసన వైరల్ ట్వీట్ : ‘‘నిన్ను నువ్వు ప్రేమించుకో’’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు.  ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజు అని ఠక్కున చెప్పేస్తాం. అలాగే ఈ ప్రేమికుల రోజున ఉపాసన ట్వీట్ వైరల్ గా మారింది. ‘‘నిన్ను నువ్వు ప్రేమించు’’..అంటూ ట్వీట్ చేశారు. ‘‘మానవ సంబంధాలు బలపడాలంటే నిన్ను నువ్వు ప్రేమించడమే తారక మంత్రం అని ఉపాసన అంటున్నారు. ఈ వాలంటైన్స్‌ డే రోజున బంధాలను మరింత బలంగా మార్చాలనుకుంటున్నారా? ప్రశ్నించిన ఉపాసన.. అందుకు కొన్ని సూచనలు కూడా చేశారు.

‘మొదట నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే ఎలాంటి షరతులు లేకుండా ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో. నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేయి. నీ మొత్తం ప్రపంచం మార్పుకు సాక్ష్యంగా నిలబడాలి’ అని తెలిపారు. 

ఫిబ్రవరి 14 అంటే ఠక్కున ప్రేమికుల రోజు అని గుర్తుకొచ్చేస్తుంది. వేరే మాటే లేదు. అలాగే ఉపాసన అంటే పరిచయం అవసరం లేని పేరు. యూనివర్శిల్ నేమ్. పెళ్లికి ముందు ప్రతీ మహిళలకు ఇంటిపేరుతోనే పరిచయం. అదే ప్రముఖులైతే ఇంటిపేరే ఓ బ్రాండ్. ఉపాసన పేరుకు ఇటువంటి బ్రాండ్ అవసరం లేదు. ఆమే ఒక బ్రాండ్. పెళ్లి ముందు ఉపాసన కామినేని అన్నా..పెళ్లి తరువాత ఉపాసన కొణిదెల అన్నా ఒక్కటే. మెగా ఫ్యామిలీ కోడలు అన్నా.. ఉపాసన అంటే పరిచయం అవసరం లేదు. 

హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే తెలిసిందే. ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయాలతోపాటు పలు సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తారు ఉపాసన. అటువంటి ఉపాసన ప్రేమికుల రోజు సందర్భంగా  చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. దటీజ్ ‘’ఉపాసన’’.

Related Posts