Home » చైన్ స్నాచింగ్‌లు సున్నా.. సేఫ్‌గా వనస్థలిపురం
Published
2 months agoon
వనస్థలిపురంలో రెండేళ్ల ముందు వరకు చైన్‌స్నాచింగ్ కేసులు అడపాదడపా వింటూనే ఉన్నాం. అలాంటిది 2020లో ఒక్క స్నాచింగ్ కూడా నమోదు కాలేదు. దాంతోపాటు ఇతర నేరాలు కూడా తగ్గుముఖం పట్టాయి. పకడ్బందీ పహారా, సీసీ కెమెరాల నిఘా, కేసుల ఛేదనలో చాకచక్యం కీలకంగా వ్యవహరించాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో 6వేల 550 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రహదారులపై కూడా 470 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
పోలీస్ శాఖతో పాటు పలు కాలనీ సంక్షేమ సంఘాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు కెమెరాలను ఏర్పాటు చేశాయి. నేరాలు జరిగినా అతి స్వల్ప కాల వ్యవధితోనే నిందితులను గుర్తించేందుకు సులభమవుతోంది. గతేడాది 68శాతంగా ఉన్న రికవరీ రేటు ఈ ఏడాది 85శాతంగా ఉంది.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో సోమవారం నాటికి 2020లో మొత్తం కేసులు వెయ్యి 91. వీటిల్లో చిన్నస్థాయి కేసులే అధికం. 2019లో 4 హత్య కేసులు నమోదుకాగా 2020లో ఒకేఒక్క హత్యకేసు. దినంలో ఇంటి తాళాలు పగులగొట్టి చేసిన చోరీలు 5, రాత్రి పూట 33. సాధారణ దొంగతనం కేసులు 36, వాహన దొంగతనాలు 30 అయ్యాయి. హత్య, ఒక దోపిడీ కేసు నమోదయ్యింది. దారిదోపిడీ, స్నాచింగ్ లాంటి కేసులు నమోదు కాలేదు.
పోలీసు రికార్డుల ప్రకారం.. రాబరీలు 4 మాత్రమే జరిగాయి. దృష్టి మరల్చి చోరీలు 3, కిడ్నాప్‌లు 14, రేప్‌లు 16, దాడి కేసులు 80, మోసాలు 104, హత్యాయత్నం కేసులు 4, రోడ్డు ప్రమాదాలు 20, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 34, మిస్సింగ్ కేసులు 126 నమోదు కాగా విచారణ జరుగుతుంది.
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు సంచలనంగా మారాయి. మెయిన్‌గా పనామా చౌరస్తాలో ఏటీఎంలో డబ్బులు పెట్టే వాహనం నుంచి రూ.75 లక్షలు లూటీ చేసిన కేసులు, సహారా రోడ్లో ఏటీఎంను గ్యాస్ వెల్డింగ్‌తో తొలగించి చేసిన కేసులు సంచలనం సృష్టించగా.. నేరస్తులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. విజయపురి కాలనీలో జరిగిన 9 దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. సొత్తు తక్కువగా పోయినా సీసీ కెమెరాలకు చిక్కకుండా తెలివిగా వ్యవహరిస్తుండటంతో పోలీసులు నిఘా పెంచారు.
కరోనా నుంచి కోలుకోకముందే.. భయపెడుతున్న కొత్త రకం వ్యాధి
కరోనా నుంచి కోలుకున్నట్లేనా.. భారత్‌లో భారీగా తగ్గిన కొత్త కేసులు
దేశంలో 116కి చేరిన కొత్తరకం కరోనా కేసులు
పశ్చిమ గోదావరిలో కోడి పందేలు నిషేధం..నిర్వహిస్తే గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు
Covid 19 Cases AP : 24 గంటల్లో 338 కేసులు, 328 మంది డిశ్చార్జ్
AP Covid 19 : 24 గంటల్లో 349 కేసులు, 472 మంది డిశ్చార్జ్