వాణిశ్రీ కొడుకుది గుండెపోటు కాదట..ఆత్మహత్య..?!

vanisri son passes away...But suspected of committing suicide

అలనాటి అందాల సినీ నటి..కళాభినేత్రి వాణిశ్రీ కుమారుడు డా.అభినయ్ వెంకటేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. కానీ వెంకటేశ్ మరణించింది గుండెపోటుతో కానీ అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తమ ఫాంహౌస్‌లో వెంకటేశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్న క్రమంలో ఇంటి దగ్గరే ఉంటున్న ఆయన గత కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడనీ..ఎవ్వరితోను పెద్దగా మాట్లాడటంలేదని సన్నిహితులు అంటున్నారు. 

వెంకటేశ్  గుండెపోటుతో మృతి చెందాడని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్న ఆయనకు భార్య అభినయ, ఓ కుమారుడు (4), కుమార్తె  ఉన్నారు. ఆయన భార్య కూడా డాక్టరే.  

1

మరిన్ని తాజా వార్తలు