లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

విద్యార్ధినిపై అత్యాచారం చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే

Published

on

Varanasi: BJP Ex-MLA accused of sexually assaulting girl student : ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మాయ శంకర్ పతాక్(70) తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్ధిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారణాసి సమీపంలోని భగుటా గ్రామానికి చెందిన ఓ విద్యార్ధిని శంకర్ పతాక్ కు చెందిన విద్యా సంస్ధల్లో ఇంటర్మీ డియేట్ చదువుతోంది.

గతంలో ఒకసారి ఆయన,  విద్యార్ధినిని తన రూమ్ లోకి పిలిపించుకుని దాడికి పాల్పడి, లైంగికంగా వేధించినట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని ఆమె తన కుటుంబ సభ్యులకు చెప్పటంతో వారంతా కాలేజీకి వచ్చి మాయ శంకర్ పతాక్ ను నిలదీశారు. దీంతో ఆయన,  ఆ రోజ క్షమాపణలు చెప్పి తప్పించుకున్నారు. ఆయువతి  పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అయితే ఈ ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత ఆ యువతి  ఇటీవల ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసింది.

అందులో ఆమె…శంకర్ పతాక్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, శారీరకంగా చిత్రహింసలకు  గురిచేసారని ఆరోపించింది. మాయ శంకర్ పతాక్ పై   చబీపూర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  కాగా…. బీజేపీలో సీనియర్ నేతగా పేరొందిన మాయ శంకర్ పతాక్ (70) 1991 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తదనంతర  కాలంలో విద్యా సంస్ధలను స్ధాపించి వాటికి చైర్మన్ గా కొనసాగుతున్నారు.

మాయ శంకర్ పై లైంగిక ఆరోపణలు రావటంతో స్ధానిక బీజేపీ నేతలు స్పందించారు.  చాలాకాలం నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెప్పారు. మరో వైపు ఆ యువతి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.