లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

బ్రేకింగ్ న్యూస్ : వరవరరావు ఆరోగ్యం విషమం!

Published

on

varavara rao health condition critical

విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలోజా జైలు నుంచి ఆయన భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనలకు గురవుతున్నారు.

గత కొంతకాలంగా వరవరరావు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. భీమా కోరెగావ్ కేసులో వరవరరావును కీలక నిందితుడిగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది. అందుకే బెయిల్ ఇవ్వొద్దని కోరడంతో కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్ లో పోలీసులు అరెస్టు చేశారు. పూణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. 2020, ఫిబ్రవరి నెలలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. కానీ..ఈ జైలులో కరోనా వ్యాధితో ఒకరు చనపోయినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో..తమ తండ్రిని విడుదల చేయాలని వరవరరావు కుమార్తెలు మహారాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ లకు లేఖలు రాశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read:టిక్‌టాక్ నిషేదంతో చైనాకు నష్టం ఎంతంటే?