VARMAA Official Trailer [Tamil] -10TV

అరవ అర్జున్ రెడ్డి ట్రైలర్ చూసారా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రముఖ దర్శకుడు బాలా డైరెక్ట్ చేస్తున్న తమిళ్ అర్జున్ రెడ్డి వర్మ ట్రైలర్ రిలీజ్

అర్జున్ రెడ్డి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. విజయ్ దేవరకొండని ఓవర్‌నైట్ స్టార్‌ని చేసేసింది. ఈ సినిమా తర్వాతే విజయ్‌కి యూత్‌లో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ పెరిగాయి. అర్జున్ రెడ్డిని ప్రస్తుతం హిందీ, తమిళ్ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కోలీవుడ్‌లో చియాన్ విక్రమ్ తనయుడు, ధృవ్ విక్రమ్ ఈ రీమేక్‌తోనే హీరోగా పరిచయం అవుతున్నాడు. తమిళ అర్జున్ రెడ్డికి వర్మ అనే టైటిల్ పెట్టారు. ప్రముఖ దర్శకుడు బాలా డైరెక్ట్ చేస్తున్న వర్మ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. 

ట్రైలర్‌లో, అర్జున్ రెడ్డిని అచ్చుగుద్దినట్టు దింపేసారు. గెడ్డంతో రఫ్ లుక్‌లో ధృవ్ అంతగా ఆకట్టుకోలేదు కానీ, ట్రిమ్ చేసి, స్మార్ట్‌గా కనిపిస్తున్న షాట్స్‌లో బాగున్నాడు. ఫస్ట్ సినిమా, అందులోనూ ట్రైలర్‌తో అతని యాక్టింగ్ స్కిల్‌ని జడ్జ్ చెయ్యలేం. మేఘ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈశ్వరీరావు, రియాజ్ విల్సన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : రథన్, కెమెరా : ఎమ్.సుకుమార్, ఎడిటింగ్ : సతీష్ సూర్య, నిర్మాత : ముఖేష్ మెహతా.

వాచ్ వర్మ ట్రైలర్…
 

Related Posts