వరుడు కావాలంటున్న రీతు వర్మ.. థియేటర్లో తేజ్ సినిమా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. పిడివి ప్రసాద సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న రొమాంటిక్ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు.


ఈ సినిమాకు ‘వరుడు కావలెను’ అనే అచ్చ తెలుగు టైటిల్ ఫిక్స్ చేశారు. ముస్తాబవుతున్న రీతు వర్మతో పాటు స్టైలిష్ లుక్‌లో ఉన్న శౌర్యను చూపించారు. గ్లింప్స్‌కు విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప్రస్తుతం ‘వరుడు కావలెను’ షూటింగ్ దశలో ఉంది.


థియేటర్లో ‘సోలో బ్రతుకే సో బెటర్’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’..  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.


లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఎట్టకేలకు డిసెంబర్లో డైరెక్ట్ థియేటర్ రిలీజ్ ఉంటుందని ప్రకటించింది మూవీ టీమ్. ప్రేక్షకులకు దీపావళి విషెస్ తెలుపుతూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ క్రిస్మస్ కానుకగా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది.

Image

Related Tags :

Related Posts :