లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

కిరాక్ కామెడీ.. ‘కూలీ నెం.1’ ట్రైలర్ చూశారా!

Published

on

Coolie No.1 Trailer: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా.. ‘కూలీ నెం.1’. 1995లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో గోవిందా, కరిష్మా కపూర్ నటించగా సూపర్ హిట్ అయిన ‘కూలీ నెంబర్ వన్’ సినిమాకి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాను డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నారు. దర్శకుడిగా ఆయన 45వ సినిమా ఇది.శనివారం ‘కూలీ నెం.1’ ట్రైలర్ రిలీజ్ చేశారు. వరుణ్, సారాల కెమిస్ట్రీ బాగుంది. పెర్ఫార్మెన్స్, డ్యాన్స్‌లో బాగా ఎనర్జిటిక్‌గా చేశారు. ఇద్దరి మధ్య అండర్ వాటర్ లిప్ లాక్ యూత్‌ని ఆకట్టుకుంటుంది.

మాల్దీవుల్లో వేదిక వయ్యారాలు


పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, జానీ లెవర్, జావేద్ జాఫ్రీ నవ్వులు పూయించారు. వరుణ్ ధావన్ ట్రైలర్ చివర్లో లేడీ గెటప్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేశాడు.


ఇండియాలోని అత్యంత ధనవంతుడైన యువకుడితో తన కూతురు పెళ్లి చేయాలనుకోవడం.. కూతురు కూలీతో ప్రేమలో పడడం, అతను అమ్మాయి తండ్రి దగ్గర ధనవంతుడిగా బిల్డప్ ఇవ్వడం, చివరకు తండ్రి అతను కూలీ అని తెలుసుకోవడం.. ట్రైలర్‌లో చాలా క్లుప్తంగా కథ చెప్పేశారు. అన్‌లిమిటెడ్ ఫన్‌తో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని అర్థమవుతోంది.


పూజా ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో.. వషూ భగ్నాని, జాకీ భగ్నానీ, దీప్షిక దేశ్‌ముఖ్ కలిసి నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ‘కూలీ నెం.1’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్ కానుంది.. ఈ సినిమాకి స్ర్కీన్‌ప్లే : రూమీ జాఫ్రీ, డైలాగ్స్ : ఫర్హాద్ సామ్జీ, ఫోటోగ్రఫీ : రవి కె.చంద్రన్, ఎడిటింగ్ : రితేష్ సోనీ.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *