లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మెగా మీమ్స్ మామూలుగా లేవుగా!

Published

on

Mega Memes: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ‘ఆచార్య’ షూటింగ్ ఇటీవల పున:ప్రారంభమైన సంగతి తెలిసిందే.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. చిరు పక్కన కాజల్ అగర్వాల్, చెర్రీ సరసన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ‘ఆచార్య’ టీజర్ కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బుధవారం ఉదయం ఎట్టకేలకు సస్పెన్స్‌కి తెరదించుతూ జనవరి 29 సాయంత్రం 4:05 గంటలకు ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో విడుదల చేశారు..

‘ఆచార్య’ ఆన్ ది వే.. చరణ్‌ని చూపిస్తారా?

ఇదిలా ఉంటే ఈ టీజర్ అప్‌డేట్ ఇవ్వడానికి సోషల్ మీడియాలో వైరల్ మీమ్స్‌ని ఎంచుకున్నారు మెగాస్టార్.. మంగళవారం సాయంత్రం ‘ఆచార్య’ టీజర్ గురించి చిరు, కొరటాల ముచ్చటించుకుంటున్న మీమ్ వదలగా వైరల్ అయ్యింది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరీ మీమ్ షేర్ చేశాడు.

నెట్టింట ఎంతో పాపులర్ అయిన ‘అతడు’ సినిమాలోని బ్రహ్మానందం ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘ఆచార్య’ టీజర్‌కి చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటగా.. ఆ… బయట టాకూ..’’ అంటూ వరుణ్ పోస్ట్ చేసిన మీమ్ ఆకట్టుకుంటోంది.. మొత్తానికి ‘ఆచార్య’ ప్రమోషన్ విషయంలో మెగా ఫ్యామిలీ మీమ్స్‌తో అదరగొడుతోంది..