లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘గని’గా మెగా హీరో.. ఫస్ట్‌లుక్ అదిరింది

Published

on

Varun Tej Boxing Drama:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ కథతో ఓ సినిమా తెరకెక్కుతుండగా.. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను చిత్రయూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది.

వరుణ్ తేజ్ కెరీర్‌లో సరికొత్త కథాంశంతో.. కంప్లీట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతుండగా.. బాబాయ్ పవన్ కళ్యాణ్ దారిలోనే బాక్సింగ్ కథాంశంతో తమ్ముడు లాంటి హిట్ కొట్టడానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్ నటిస్తూ ఉండగా ఓ కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కనిపించబోతున్నాడు. ఈ సినిమాను కన్నడలో కూడా చిత్రయూనిట్ విడుదల చేసే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ సినిమా బాలులోని పాత్ర పేరు ‘గని’.. అప్పట్లో బాగా ఈ పేరు బాగా పాపులర్ కాగా.. అదే పేరును ఇప్పుడు ఈ సినిమాకు పెట్టారు. ప్రస్తుతం F3 సినిమాతో పాటే ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటించబోతున్నాడు.