Kauravas test tube baby on VC  Nageswara Rao's sensational comments

వీసీ వ్యాఖ్యలు : కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీలే 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్‌ బేబీలట..గైడెడ్‌ క్షిపణుల టెక్నాలజీ..భారతదేశానికి కొత్తేం కాదనీ..విష్ణుమూర్తి సుదర్శన చక్రం శతృసంహారం చేసిన తిరిగి విష్ణుమూర్తి చేతికి వచ్చింనీ..దీన్ని బట్టి చూస్తే భారతదేశానికి గైడెబ్ క్షిపణుల మేకింగ్ కొత్తేం కాదని ఓ యూనివర్శిటీ వీసీ వ్యాఖ్యానించారు.

జలంధర్‌ :  కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్‌ బేబీలట..గైడెడ్‌ క్షిపణుల టెక్నాలజీ..భారతదేశానికి కొత్తేం కాదనీ..విష్ణుమూర్తి సుదర్శన చక్రం శతృసంహారం చేసిన తిరిగి విష్ణుమూర్తి చేతికి వచ్చింనీ..దీన్ని బట్టి చూస్తే భారతదేశానికి గైడెబ్ క్షిపణుల మేకింగ్ కొత్తేం కాదని ఓ యూనివర్శిటీ వీసీ వ్యాఖ్యానించారు. జనవరి 3న  ఆంధ్రా యూనివర్శిటీ జరుగున్న భారత సైన్స్‌ కాంగ్రెస్‌లో వైస్ ఛాన్సలర్ జి.నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. వేలాది ఏళ్ల క్రితం నుంచే గైడెడ్‌ క్షిపణులకు సంబంధించిన టెక్నాలజీ భారత్‌కు బాగా తెలుసనీ అన్నారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు శత్రుసంహారం కోసం సుదర్శనచక్రాన్ని వదిలే వారని..శతృసంహారం అయిపోయిన తరువాత ఆ చక్రం కాస్తా వెనుదిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చేసేదనీ దీన్ని బట్టి చూస్తే గైడెడ్‌ క్షిపణి పరిజ్ఞానం భారత దేశానికి ఏ మాత్రం కొత్తకాదని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ వీసీగారి పురాణం అప్పుడే పూర్తి కాలేదు..కౌరవుల తల్లి గాంధారి మాత పుట్టిన కౌరవులంతా టెస్ట్‌ట్యూబ్‌ బేబీలేనని ఆయన వ్యాఖ్యానించారు. గాంధారీ మాతకు అబార్షన్ అయిన తరువాత ఆ 101 అండాలను (100మంది కౌరవులతో పాటు ఒక సోదికి కూడా వుంది) 101 కుండల్లో ఉంచి ఫలదీకరించిన మీదటే కౌరవుల జననం జరిగిందని దీన్ని ఎవరు కాదంటారు అని వీసీ జి.నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. 

 

Related Posts