venkatesh-speech-venky-mama-pre-release-event

చైతూ చించేశాడు.. నా అండాదండా మీరే: వెంకీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మేనమామ, మేనల్లుడు వెంకటేశ్, నాగ చైతన్య మామా అల్లుళ్లుగా తెరకెక్కిన చిత్రం ‘వెంకీ మామ’. డిసెంబరు 13న విడుదల కానున్న సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్‌ను డిసెంబర్ 7న నిర్వహించారు. ఖమ్మం జిల్లాలోని లేక్ వ్యూ క్లబ్ వేదికగా జరిగిన కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. పాటలు, హీరోయిన్ల స్టెప్పులు, వెంకీ డైలాగ్ లకు స్టేజ్ ముందు జనం ఫుల్ జోష్ లో కనిపించారు. 

బిగ్ బాస్ తర్వాత యాంకరింగ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీ ముఖి చక్కటి మాటలతో ఆకట్టుకుంది. చివరివరకూ వెంకీ స్పీచ్ కోసం ఎదురుచూసిన అభిమానులకు బూస్టింగ్ ఇచ్చాడు వెంకటేశ్. ఇంతమంది అభిమానులను చూసి మీతో పాటు అక్కడికి రావాలని ఉంది. వస్తే నా పరిస్థితి డౌట్ అందుకే ఇక్కడి నుంచి మాట్లాడుతున్నానని ప్రారంభించాడు. 

> ప్రీ రిలీజ్ ఆడియో ట్రైలర్ లాంచ్ కు ఇక్కడకు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. 
> సినిమాలో చైతూకే మామని సినిమా తర్వాత తెలుగు వాళ్లందరికీ వెంకీ మామనే. 
> మా బ్యానర్ లో చైతూ ఫస్ట్ సినిమా చేశాడు. చైతూ పర్ ఫార్మెన్స్ చించేశాడు. 
> మంచి కథతో పాజిటివ్ గా పనిచేశాం. అన్ని డిపార్ట్ మెంట్ లు బాగా కష్టపడ్డారు. సినిమా బాగా వచ్చింది. 
> మామా అల్లుళ్ల యాక్షన్ ఎమోషన్ టెర్రిఫిక్ గా తీశాడు డైరక్టర్. 

ఇలాంటి మాటలతో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. డైలాగ్ అడిగిన అభిమానులకు ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేశ్. నా అండదండా అంతా అభిమానులే. 30ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. ఈవెంట్ కు వచ్చిన వారందరికీ థ్యాంక్స్. మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి అని ముగించాడు. 

Related Posts