‘మోసగాళ్ల’కు వెంకీమామ వాయిస్..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Venkatesh – Mosagallu Movie: మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. ప్రపంచంలో అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.24 Frames Factory, AVA Entertainment బ్యానర్‌లపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది.‘మోసగాళ్లు’ చిత్రానికి వెంకీమామ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఈ సినిమా కథను వివరిస్తూ ఆరంభం నుంచి ముగింపు వరకు వెంకీ వాయిస్ సాగుతందట. మంచు విష్ణుతో పనిచేయడం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందని వెంకీ ట్వీట్ చేశారు.


తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, రుహీ సింగ్, నవదీప్, నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Sam C. S. సంగీతమందిస్తున్నారు.

Related Tags :

Related Posts :