Movies
కమర్షియల్ హంగులతో వెంకీమామ – రివ్యూ
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ రివ్యూ..
Home » కమర్షియల్ హంగులతో వెంకీమామ – రివ్యూ
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ రివ్యూ..
Published
1 year agoon
By
sekharవిక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన ‘వెంకీ మామ’ రివ్యూ..
రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన సినిమా.. ‘వెంకీ మామ’.. వెంకీతో పాయల్ రాజ్‌పుత్, చైతుతో రాశీఖన్నా జతకట్టగా.. బాబీ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిజ జీవితంలో ఉన్న రిలేషన్‌ని స్క్రీన్‌పై కూడా ప్రెజెంట్ చేస్తూ సినిమాలు తీస్తే కాస్త కనెక్టివిటీ ఎక్కువగా ఫీల్ అయ్యి హిట్ అందిస్తారు ప్రేక్షకులు అని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఒక్క ‘మనం’ తప్ప మళ్ళీ ఆ ఫార్ములాని అంత గట్టిగా వాడుకున్న సినిమా ఏదీ లేదు. అందుకే మళ్ళీ ఆ హిట్ ఫార్ములాని గట్టిగా నమ్ముకున్న దగ్గుబాటి మామ వెంకటేష్, అక్కినేని అల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అంటూ వచ్చాడు. మరి ఈ కొత్త కాంబినేషన్‌కి ఆ పాత ఫార్ములా హిట్ అందించిందా లేక జస్ట్ ఓకే అనిపించిందా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే :
ఒక పల్లెటూరిలో ఉండే వెంకటరత్నం నాయుడు అక్క యాక్సిడెంట్లో చనిపోవంతో వాళ్ళ కొడుకు, తన మేనల్లుడు అయిన కార్తీక్‌ని తానే పెంచుకుంటూ ఉంటాడు. కార్తీక్ కూడా తన మావయ్య అంటే చాలా ప్రేమగా ఉంటాడు. కాకపోతే కార్తీక్ జాతకంలో శ్రీ కృష్ణుడి అంశ ఉండడంతో జాతకాలను ఎక్కువగా నమ్మే వెంకటరత్నం నాయుడు నాన్న అయిన రామ్ నారాయణ మాత్రం కార్తీక్‌ని అంతగా ఇష్టపడడు. అయితే కార్తీక్ జాతకంలో ఉన్న ఈ అంశ వల్లే వెంకటరత్నం నాయుడు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. కానీ ఎప్పుడూ వెంకటరత్నం నాయుడు తన మేనల్లుడు కార్తీక్‌కి సపోర్ట్ ఇస్తుంటాడు. అలా పల్లెటూరిలో ఆడుతూపాడుతూ జాలీగా గడిపేసే మామాఅల్లుళ్ళ కథ ఉన్నట్టుండి కార్తీక్.. తన మామకి తెలియకుండా మిలిటరీలో జాయిన్ అవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. దాంతో అతనిని వెతుక్కుంటూ కాశ్మీర్ వచ్చిన వెంకటరత్నం నాయుడుకి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కార్తీక్ నిర్ణయానికి కారణం ఏంటి? చివరికి ఆ మామా అల్లుళ్ళ మధ్య ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Read Also : హ్యాపీ బర్త్‌డే వెంకీ మామ
నటీనటుల విషయానికి వస్తే :
ఈ సినిమాలో వెంకటేష్, నాగ చైతన్య ఇద్దరూ కలిసి నటించినప్పటికీ కథలో వెంకీకి ప్రాధాన్యత ఎక్కువగా ఉండడంతో సినిమాలో కూడా అదే రెఫ్లెక్ట్ అయ్యింది. వెంకటేష్ మీదే బేస్ అయిన కథని అతని అనుభవం ఉపయోగించి బాగానే లాగించాడు. ఇక సెకండ్ హాఫ్‌కి వచ్చే సరికి కథ కాశ్మీర్‌కి షిఫ్ట్ అవ్వడంతో చైతుని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగింది. దాంతో అక్కడ చైతూకి స్కోప్ దొరికింది.
కానీ వెంకీ మామ ఓవరాల్ ఫ్లేవర్ మాత్రం వెంకటేష్ వల్లే నిలబడింది. వెంకీ కామెడీ టైమింగ్, అతను పండించిన సెంటిమెంట్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఇక హీరోయిన్స్‌కి మాత్రం పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఉన్నంతలో పాయల్ పండించిన కామెడీ మాస్ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఉంది. రాశి క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్, నాజర్, దీప, రావు రమేష్ తదితరులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, విద్యుల్లేఖ తమ కామెడీతో నవ్వులు పూయించారు.
టెక్నీషియన్స్ విషయానికొస్తే :
ఈ సినిమా డైరెక్టర్ బాబీ కథ వేరే వాళ్ళు రాసుకున్నా కూడా దానికి తగ్గ ట్రీట్మెంట్ మాత్రం బాగానే ఇచ్చాడు. అయితే ఫస్ట్ హాఫ్ వరకు స్మూత్‌గా సాగిపోయిన వెంకీమామ సెకండ్ హాఫ్‌లో మాత్రం తడబడుతూ వెళ్ళింది. కామెడీ కూడా తగ్గడం వంటివి సినిమాకి అవరోధాలుగా మారాయి. వాటిని హ్యాండిల్ చెయ్యడంలో డైరెక్టర్ బాబీ కాస్త తడబడ్డాడు.
ఇక ఈ మధ్య సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్న థమన్ ఈ సినిమాకి ఇచ్చిన హిట్ ఆల్బమ్ సినిమాలో కూడా క్లిక్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ బావుంది. ఈసినిమాకు తగ్గట్టు క్వాలిటీ విజువల్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు సినిమాటోగ్రాఫర్. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద సంస్థ నిర్మించడంతో.. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
ఓవరాల్‌గా చెప్పాలంటే : వెంకీ ఇమేజ్‌ని వాడుకుంటూ, చైతూని కూడా బేలన్స్ చేస్తూ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరినీ కట్టుకునేలా ఉండే సినిమా చెయ్యాలని తెరకెక్కించిన ‘వెంకీ మామ’ కొంతవరకు నవ్వించాడు, నచ్చేసాడు. కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. ఓవరాల్‌గా మాత్రం సినిమా మీద ఉన్న బజ్‌ని క్యాష్ చేసుకుంటూ బాక్సాఫీస్ దగ్గర మాత్రం సందడి చేసే అవకాశాలయితే ఉన్నాయి.