very cold in telangana

చలి తీవ్రత పెరిగింది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్రంలో మరో మూడురోజులు పొడి వాతావరణం వల్ల చలిగాలులు అధికంగా వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్‌ : చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గజ గజ వణికిస్తోంది. పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. రాష్ట్రంలో మరో మూడురోజులు పొడి వాతావరణం వల్ల చలిగాలులు అధికంగా వీచే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దిశ, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యా ల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  
 

Related Posts