పోకిరీల పైశాచికత్వం..అరుదైన అలుగును చంపి ఇనుపరాడ్‌కు గుచ్చి..సెల్ఫీలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశంలో మూగజీవాలపై మారణ హోం జరుగుతూనేఉంది. ఏనుగులను పేలుడు పదార్ధాలతో చంపేసిన ఘటనలు..కాఫీ తోటల్ని పాడు చేస్తున్నాయని ఆవులను చంపేసి గోతుల్లోపడేసిన దారుణ ఘటనలు మరిచిపోకుండానే ఇప్పటికే అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన జాతికి చెందిన పెంగోలియన్‌ (అలుగు)ను కొంతమంది పోకిరీలు అత్యంత క్రూరంగా చంపేశారు. అప్పటికీ వారి పైశాచికత్వం తీరలేదు. ఆ అలుగును ఇనుపరాడ్‌కు గుచ్చి..సెల్ఫీలు తీసుకుంటూ పైశాచిక ఆనందం పొందారు. గురువారం (జులై 24,2020) రాత్రి కర్నాటకలోని షెఫీన్‌ షా ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచరాం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్నపోలీసులు వారిని అరెస్టు విచారిస్తున్నారు.

అటవీ ప్రాంతం నుంచి పొరపాటున జనావాసాల్లోకి వచ్చిన పెంగోలియన్‌ కొంత మంది ఆకతాయిల కంట పడింది. అంతే..దానిపై దాడి చేసి అతిక్రూరంగా చంపేశారు. వారు చేసిన ఘనకార్యాన్ని వీడియోలు..ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు.

శరీరంపై పొలుసులను కలిగి ఉండే ఈ అలుగు ఔషదాల తయారీకి ఎంతో ఉపయోగపడుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది స్మగ్లర్లు దీన్ని అక్రమంగా అమ్ముతుంటారు. వేటగాళ్లకు చిక్కి ప్రాంతాలు దాటేస్తున్న ఈ అరుదైన జాతి అలుగులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దీంతో అలుగులను చంపటం..అక్రమ రవాణా చేయటంపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టినా అధికారుల కళ్లు కప్పి వీటి రవాణా జరుగుతునే ఉంది.

అలుగు ఫోలిడోటా జాతికి చెందిన క్షీరదం.ఆహారం కోసం రాత్రి వేళలో ఇవి సంచరిస్తుంటాయి. ఏదైనా అలికిడి వినిపిస్తే చాలు చుట్టలా చుట్టుకుపోతాయి. చీమల్ని, చెదపురుగుల్ని, చిన్న చిన్న కీటకాలు తింటుంటాయి. తమ జీవితకాలంలో అలుగులు రెండు-మూడు పిల్లలనే కంటాయి. ప్రతి పిల్లను రెండేళ్ల వరకు శ్రద్ధగా పోషించి పెంచుతాయి. మాంసం, పొలుసులకోసం వేటాగాళ్లకు బలైపోతున్నాయి.అలుగుల్ని ఔషధాలకు వినియోగించటంతో వీటి సంఖ్య తగ్గిపోతోంది. అలాగే అడవుల నరికివేత కారణంగా వాటికి నివసించడానికి వీలైన చోటులు కరువౌతున్నాయి. తక్కువ పిల్లల్ని కనటం..అంతకంటే ఎక్కువగా మనుషుల స్వార్థానికి బలైపోతున్నాయి ఈ అరుదైన మూగజీవాలు.

Related Posts