లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

మగాళ్లకు మాత్రమే వస్తున్న వైరస్

Published

on

Virus: అమెరికాలో ఆల్రెడీ వందల కొద్దీ మగాళ్లు దీని బారిన పడ్డారు. నరాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, జ్వరం వచ్చి తగ్గిపోతుండటం, ఊపిరితిత్తుల సమస్య లాంటి సమస్యలు 40శాతం మందిలో కనిపిస్తే మిగిలిన వారు ప్రాణాలు కోల్పోయారని సైంటిస్టులు కనుగొన్నారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఈ జబ్బును గురించి కనుగొన్నారు. దీనికి వెక్సాస్ అనే పేరు పెట్టి పరిశోధనలు మొదలుపెట్టారు. 2వేల 500మంది నుంచి సమాచారం సేకరించి వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నారు.‘ఈ సమస్యతో వస్తున్న చాలా మంది పేషెంట్లకు చికిత్స అందించలేకపోతున్నాం’ అని ఎన్ఐహెచ్ క్లినికల్ సెంటర్ డా. డేవిడ్ బీ బెక్ అంటున్నారు. ‘అందుకే మేం లక్షణాలపై ఫోకస్ పెట్టకుండా రివర్స్‌లో వెళ్తున్నాం. జెనెటికల్‌గా స్టడీ చేసి సమస్య తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని డా. బెక్ అన్నారు.

ఈ పద్ధతి ప్రకారం.. సైంటిస్టులు మధ్య వయస్కులను గుర్తించి పరివర్తనల ఆధారంగా ఒకేరకమైన UBA1 వంటి జీన్‌ను గమనించారు. ఆ తర్వాత 22 మంది ఒకే లక్షణాలతో పాటు ఒకే పరివర్తన ఉన్నవాళ్లను గుర్తించారు. వారిలోనూ బ్లడ్ క్లాట్ అవడం, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించాయి. వెక్సాస్ అనే జబ్బుపై రీసెర్చ్ టీం ఫోకస్ పెట్టింది.

దీనిని బట్టి తెలిసింది ఏంటంటే కేవలం ఈ జబ్బు మగాళ్లకే వస్తుంది. దేనికంటే ఇది X క్రోమోజోమ్ తో లింక్ అయి ఉంది. మగాళ్లలో x క్రోమోజోమ్ ఒక్కటే ఉండటం, మహిళల్లో రెండు x క్రోమోజోములు ఉండటం దీనికి కారణం.

సైంటిస్టులు ఈ జబ్బుపై జెనోమ్ ఫస్ట్ టెక్నిక్‌తో రీసెర్చ్ చేస్తున్నారు. ఈ డయాగ్నసిస్, పేషెంట్లను ట్రీట్ చేసే తీరుకు.. దానిపై విశ్లేషణ జరిపేందుకు హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కు చాలా ఉపయోగపడుతుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *