Video: పరుగులో ఓడిపోయాడు.. కానీ కోట్ల మనసులు గెలిచాడు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఓడినా కూడా గెలవడం అనేది కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది. అటువంటి గొప్పవ్యక్తుల్లో ఇతను ఒకరు.. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒక వ్యక్తి గురించి ఇలానే మాట్లాడుకుంటుంది. ఆ వ్యక్తి ఎవరంటే.. Méntriga.. ఒక స్పానిష్ ట్రై అథ్లెట్.. 2020 శాంటాండర్ ట్రయాథ్లాన్ రేస్‌లో స్పెయిన్‌కు చెందిన డియాగో మెంట్రిడా, బ్రిటన్‌కు చెందిన జేమ్స్ టీగల్ రేసులో ఉన్నారు.




ఈ సమయంలో, స్పెయిన్ దేశస్థులు ట్రయాథ్లెట్ మెంట్రిడా అద్భుతమైన క్రీడా స్పూర్తిని ప్రదర్శించడం ద్వారా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. బ్రిటీష్ అథ్లెట్ జేమ్స్ టీగల్ రేస్‌లో ఫైనల్ లైన్ ముందు మార్గం తప్పి అడ్డంకిని ఢీ కొట్టాడు.. అతని వెనుక వస్తున్న స్పెయిన్‌కు చెందిన డియాగో మెంట్రిడా పైనల్ లైన్‌కు చేరుకునే అవకాశం వచ్చినా కూడా తన ముందు వ్యక్తి మార్గం తప్పడం గమనించి అతను రేసును గెలవడానికి పూర్తి అవకాశం ఉన్నా కూడా ఆగిపోయాడు.

బ్రిటిష్ అథ్లెట్‌ను లైన్‌ను దాటడానికి అనుమతించాడు. లైన్ దగ్గర ఆగి, తన ప్రత్యర్థి కోసం ఎదురుచూడగా.. అప్పుడు జేమ్స్ టీగల్ వెనుక నుంచి వచ్చి గీతను దాటి రేసును పూర్తి చేశాడు. ఈ రేసులో టీగల్‌కు కాంస్య పతకం లభించింది.



తప్పు మలుపుతో టీగల్ అడ్డంకిని తాకినప్పుడు మెంట్రిడాను అధిగమించే అవకాశం వచ్చినా అలా చెయ్యని క్రీడా స్ఫూర్తికి అందరూ మెంట్రిడాను ప్రశంసించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.



దీనిపై స్పందించిన స్పానిష్‌ అథ్లెట్‌.. ‘పందెంలో జేమ్స్ టీగల్ నాకంటే ముందే ఉన్నాడు. అతను గెలుపుకు అర్హుడు’. అందుకే అలా చేసినట్లు చెప్పాడు. నా పనికి గర్వపడుతున్నాను అని అన్నారు. ట్విటర్‌లో పోస్టు చేసిన ఆ వీడియోను ఇప్పటికే 6.8 మిలియన్ల మంది వీక్షించారు.

Related Posts