లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

బికినీతో ఫొటో షూట్, మోడల్ చేసిన సాహసానికి ఒళ్లు జలదరించాల్సిందే..వీడియో వైరల్

Published

on

Model’s Dangerous Bikini Shoot : మోడలింగ్..ఈ రంగంలో రాణించాలని ఎంతో మంది తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇందుకు శరీర ఆకృతినే మార్చేసుకుంటుటారు. అత్యంత కఠినంగా డైట్ చేస్తుంటారు. వివిధ ప్రాంతాల్లో ఫొటోలు దిగుతూ..ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. తాము దిగిన ఫొటోలు, వీడియోలను వారి వారి సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. దీంతో వారిని ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. కానీ..ఓ మోడల్ చేసిన సాహసం అందర్నీ నోరెళ్లబెట్టేలా చేసింది. పెన్సిల్వీనియాలోని పిట్స్ బర్గ్ కు చెందిన 25 ఏళ్ల యువతి..అమరీస్ రోజ్ మోడలింగ్ చేస్తుంటారు. దక్షిణాఫ్రికాలోని డెవిల్ పూల్స్ వద్ద బికినీ ధరించి ఫొటో షూట్ లో పాల్గొంది. అంతవరకు బాగానే ఉంది.

కానీ…విక్టోరియా ఫాల్స్ అంచున దిగి..పెద్ద సాహసమే.. చేసింది. సుమారు 1650 అడుగుల ఎత్తున ఈ జలపాతం ఉంటుంది. వేగంగా పరుగులు తీస్తున్న నీళ్ల ప్రవాహాంతో నవ్వుతూ ఫొజులు ఇచ్చింది. ఏ మాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పినా..ప్రాణాలు పోవడం ఖాయం. ఈమె చేసిన ఫొటోషూట్ కు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు మండిపడుతున్నారు. ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఇలాంటి సాహసాలు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇతరులు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే..ఎవరిది బాధ్యత అని నిలదీస్తున్నారు. అయితే..ఆమె చేసిన సాహసాన్ని మాత్రం కొంతమంది ప్రశంసిస్తూ..ఓ లైక్ వేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amairis Rose 🌹 (@mairisloc)