లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

కాలేజీ బయటే యువతి దారుణ హత్య.. 2018లో కిడ్నాప్

Published

on

women-murdered

Haryanaలో 21 సంవత్సరాల స్టూడెంట్‌ను నడిరోడ్డుపై హత్య చేసిన దుండగులు మెరుపువేగంతో పారిపోయారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో ఘటన రికార్డ్ అవడంతో నిజం బయటపడింది. ఢిల్లీకి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో యువతిని ముందుగా కార్లోకి తీసేందుకు ప్రయత్నించాడు.

అది కుదరకపోవడంతో గన్ తో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో షూట్ చేసి పారిపోయాడు. మధ్యాహ్నం 3గంటల 40నిమిషాల ప్రాంతంలో ఫరిదాబాద్ లోని బల్లాబ్‌గర్ కాలేజీ బయట ఈ ఘటన జరిగింది. నిఖితా తోమర్ అనే ఫైనల్ ఇయర్ కామర్స్ స్టూడెంట్ పరీక్ష రాసేందుకు బయటకు వచ్చి వెళ్తుండగా ఘటన జరిగింది.తౌసిఫ్, అతని స్నేహితుడు రెహాన్ కలిసి ఆమె బయటకు వచ్చే సమయం వరకూ వెయిట్ చేసి ఈ ఘటనకు పాల్పడ్డారు. తౌసిఫ్ ఆమెపై దాడి చేయడం ఇది తొలిసారి కాదు. 2018లోనూ ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఫరీదాబాద్ పోలీస్ ఆఫీసర్ ఓపీ సింగ్ తెలిపారు.

ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సెక్యూరిటీ వీడియోలో సీన్ అంతా రికార్డ్ అయింది. నికితా, ఆమె స్నేహితురాలు కారు దగ్గర్లో ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రం నికితాను కారులోకి తోసేందుకు ప్రయత్నించాడు. నిరాకరించి ఎదురుతిరగబడి పారిపోవడానికి ప్రయత్నించింది.

ఆమెకు దగ్గరగా వెళ్లి పాయింట్ బ్లాంక్ లో షూట్ చేశాడు. ఆ తర్వాత ఫ్రెండ్ తో కలిసి కార్లో వెళ్లిపోయాడు. నిఖితా రోడ్ మీద రక్తం కారుతూ పడిపోయింది. పక్కనే ఉన్న స్నేహితురాలు హాస్పిటల్ లో చేర్పించగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయింది.

తౌసిఫ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2018లోనూ అతనిపై బాధితురాలి తండ్రి కేసు పెట్టి విత్ డ్రా చేసుకున్నారని పోలీసులు చెప్పారు.

‘2018లోనే తౌసిఫ్ పై మా కూతుర్ని వేధిస్తున్నాడంటూ కేసు ఫైల్ చేశాం. మా కూతురు పేరు బయటకు రాకూడదని తర్వాత విత్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మొత్తానికి నా బిడ్డను కాల్చి చంపేశారు. నాకూతురు పరీక్ష రాయడానికి కాలేజికి వెళ్లింది. వాడు బలవంతంగా కార్లో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించడంతో ఆమె తిరస్కరించింది. వాదన జరుగుతుండగానే వాడు కాల్చేశాడు’ అని బాధితురాలి తండ్రి ఆవేదన వెల్లగక్కాడు.

నికితా తల్లి మాట్లాడుతూ.. నా కూతురి విషయంలో న్యాయం జరగాలి. వాళ్లను కూడా అదే తరహాల్ షూట్ చేయండి అని చెప్పింది.

నేషనల్ కమిషన్ ఫర్ ఉమన్ కూడా ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించి హర్యానా పోలీస్ చీఫ్ కు నిందితులను పట్టుకోవాలంటూ లేఖ రాసింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *