Viral Video: విద్యార్థులకు 700 ఐస్ క్రీమ్‌లు ఇచ్చిన టీచర్

విద్యార్థులను సంతోష పెట్టేందుకు కొందరు ఉపాధ్యాయులు పలు రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు విద్యార్థులకు బహుమతులు అందించడం, టూర్ కు తీసుకెళ్తుండడం, వారితో ఆటలు ఆడించడం వంటి పనులను ఉపాధ్యాయులు చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, ఓ టీచర్ భిన్నంగా ఆలోచించి, తమ విద్యార్థులకు 700 ఐస్ క్రీములు అందించారు.

Viral Video: విద్యార్థులకు 700 ఐస్ క్రీమ్‌లు ఇచ్చిన టీచర్

Viral Video

Viral Video: విద్యార్థులను సంతోష పెట్టేందుకు కొందరు ఉపాధ్యాయులు పలు రకాల ప్రయోగాలు చేస్తుంటారు. అప్పుడప్పుడు విద్యార్థులకు బహుమతులు అందించడం, టూర్ కు తీసుకెళ్తుండడం, వారితో ఆటలు ఆడించడం వంటి పనులను ఉపాధ్యాయులు చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే, ఓ టీచర్ భిన్నంగా ఆలోచించి, తమ విద్యార్థులకు 700 ఐస్ క్రీములు అందించారు.

తన పుట్టినరోజు సందర్భంగా ఆ ఉపాధ్యాయుడు ఈ పని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గుడ్‌న్యూస్ కరస్పాండెంట్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే లక్షలాది మంది దీన్ని చూశారు. తన 50వ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు సర్ ప్రైజ్ ఇవ్వాలని భావించారు.

విద్యార్థులకు పిలిచి 700 మందికి ఐస్ క్రీములు ఇస్తానని చెప్పారు. ట్రక్కులో తాను తీసుకొచ్చిన ఐస్ క్రీములను విద్యార్థులందరికీ పంచారు. 50వ పుట్టినరోజు సందర్భంగా ఏం చేస్తారని ఆ టీచర్ ను ఆయన భార్య అడిగారని గుడ్‌న్యూస్ కరస్పాండెంట్ ట్విట్టర్ ఖాతాలో చెప్పారు.

దీంతో పుట్టినరోజు పార్టీ గిఫ్టులుగా తనకు ఏమీ ఇవ్వకూడదని తన కుటుంబ సభ్యులకు చెప్పి, అలా కుటుంబ సభ్యుల వద్ద మిగిలిన డబ్బులతో 700 ఐస్ క్రీములు కొనుక్కువచ్చారని తెలిపారు. విద్యార్థులకు ఆ టీచర్ ఐస్ క్రీములు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Self-flying planes : పైలట్ అవసరం లేకుండా.. సెల్ఫ్ ఫ్లైయింగ్ విమానాలు