FIFA World Cup -2022: రంగు రంగుల అద్దాల దుస్తులు ధరించి స్టేడియానికి అభిమాని.. వీడియో

ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను చూసేందుకు ఓ వ్యక్తి అద్దాల దుస్తులను ధరించి వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చాడు. బ్రెజిల్ కు చెందిన ఆ అభిమాని ధరించిన దుస్తులు చాలా విభిన్నంగా ఉండడంతో అతడితో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు పోటీ పడ్డారు. రంగు రంగుల అద్దాల దుస్తులు ధరించి స్టేడియానికి వచ్చిన ఆ అభిమాని చాలా హుషారుగా కనపడ్డాడు.

FIFA World Cup -2022: రంగు రంగుల అద్దాల దుస్తులు ధరించి స్టేడియానికి అభిమాని.. వీడియో

FIFA World Cup -2022

FIFA World Cup -2022: ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను చూసేందుకు ఓ వ్యక్తి అద్దాల దుస్తులను ధరించి వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చాడు. బ్రెజిల్ కు చెందిన ఆ అభిమాని ధరించిన దుస్తులు చాలా విభిన్నంగా ఉండడంతో అతడితో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు పోటీ పడ్డారు. రంగు రంగుల అద్దాల దుస్తులు ధరించి స్టేడియానికి వచ్చిన ఆ అభిమాని చాలా హుషారుగా కనపడ్డాడు.

ఫిఫా ప్రపంచ కప్ ను పోలిన కప్ ను కూడా చేతిలో పట్టుకుని అతడు స్టేడియం వద్ద కలియతిరిగాడు. ఆ కప్ కూడా రంగు రంగుల అద్దాలతో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. నిన్న ఖతర్ ఎడ్యుకేషన్ స్టేడియంలో బ్రెజిల్-క్రొయేషియా మధ్య మ్యాచ్ జరిగింది.

ఆ సమయంలోనే బ్రెజిల్ అభిమాని ఇలా విచిత్ర వేషధారణతో కనపడ్డాడు. చాలా మంచి ఐడియాతో అతడు స్టేడియానికి వచ్చాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, సెమిఫైనల్ లోకి ప్రవేశించడానికి నిన్న జరిగిన మ్యాచులో క్రొయేషియా చేతిలో బ్రెజిల్ 4-2 తేడాతో ఓడిపోయింది.

Bangladesh vs India: బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం