Viral Video: క్రిస్మస్ స్పెషల్… -30 డిగ్రీల చలిలో భాంగ్రా నృత్యం చేసిన గుర్దీప్ పంధర్

ఓ వ్యక్తి కెనడాలోని యుకాన్ లో -30 డిగ్రీల చలిలో పంజాబ్ సంప్రదాయ జానపద భాంగ్రా నృత్యం చేసి అలరించాడు. సిక్-కెనడియన్ గుర్దీప్ పంధర్ కు భాంగ్రా నృత్యం అంటే చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఆయన ఆ నృత్యం చేస్తూ వీడియోలు తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటాడు. ఆ నృత్యమే గుర్దీప్ పంధర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Viral Video: క్రిస్మస్ స్పెషల్… -30 డిగ్రీల చలిలో భాంగ్రా నృత్యం చేసిన గుర్దీప్ పంధర్

Viral Video

Viral Video: ఓ వ్యక్తి కెనడాలోని యుకాన్ లో -30 డిగ్రీల చలిలో పంజాబ్ సంప్రదాయ జానపద భాంగ్రా నృత్యం చేసి అలరించాడు. సిక్-కెనడియన్ గుర్దీప్ పంధర్ కు భాంగ్రా నృత్యం అంటే చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఆయన ఆ నృత్యం చేస్తూ వీడియోలు తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంటాడు. ఆ నృత్యమే గుర్దీప్ పంధర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

క్రిస్మస్ సందర్భంగా ఆయన మరోసారి భాంగ్రా నృత్యంతో అలరించాలని భావించాడు. అయితే, అందులో చాలా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు. కెనడాలోని యుకాన్ లో -30 డిగ్రీల ఉష్ణోగ్రతలోకి వెళ్లి భాంగ్రా నృత్యం చేశాడు. రక్తం గడ్డకట్టే చలిలో ఆయన చేసిన నృత్యానికి సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. -30 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఈ నృత్యం చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు, సానుకూల దృక్పథాన్ని పంపుతున్నానని ఆయన పేర్కొన్నాడు.

ఆయన చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాగే, ప్రపంచానికి మంచి సందేశాలు ఇస్తూ యాత్రను కొనసాగించాలని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. సానుకూల కాగా, గుర్దీప్ పంధర్ భాంగ్రా నృత్యాన్ని పలు దేశాల్లో పరిచయం చేశాడు.

Manchu Family Christmas Celebrations : మంచు ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్