వియత్నాంలో వరద బీభత్సం…90మంది మృతి,34మంది గల్లంతు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Vietnam: 90 People Killed As Floods ఆగ్నేయ ఏసియా దేశమైన వియత్నాంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఓ వైపు వరదలు,మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో వియత్నాం విలవిలలాడుతోంది. గడిచిన రెండు వారాలుగా కురుస్తున్నఅతి భారీ వర్షాలతో . క్వాంగ్​ త్రీ, తువా థియాన్​హ్యూ, క్వాంగ్​నామ్​ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.తాజా సమాచారం ప్రకారం…వియత్నాంలో వరదల కారణంగా, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 34మంది గల్లంతయ్యారు. ఆదివారం(అక్టోబర్-18,2020) కొండచరియలు విరిగిపడి 22మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.భారీ వర్షాల నేపథ్యంలో వరదల దెబ్బకు లక్షమందికి పైగా ప్రభావితమయ్యారు. మౌలిక సదుపాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. విద్యుత్​ సరఫరా నిలిచిపోయి.. కొన్ని ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. లక్షలాది మూగజీవులు బలివరదల కారణంగా 5 లక్షల 31 వేల 800 మూగజీవులు చనిపోయాయని అక్కడి అధికారులు తెలిపారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అధికారులు… రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related Tags :

Related Posts :