కిలాడీ లేడీ ముఠా..వాడిపడేసిన కండోమ్స్‌ను కడిగి అమ్మేస్తున్నారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కండోమ్స్ వినియోగించేవాళ్లకు ఈ విషయం తెలిస్తే హడలిపోతారు.వాడి పడేసిన కండోమ్ లను తిరిగి వాటిని కడిగేసి మళ్లీ ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు. డబ్బుల కోసం అత్యాశకు పోయి ఇటువంటి దారుణ వ్యాపారాలకు తెగబడుతున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. వాడేసిన కండోములను మళ్లీ జనానికి అంటగడుతున్నారు. వియత్నాంలో ఈ దారుణ వ్యాపారం జరుగుతోంది. లక్షల కొద్దీ వాడేసిన వాటిని కడిగి మళ్లీ ప్యాక్ చేసి అమ్ముతున్న రాకెట్ ముఠా గుట్టు బైటపడింది. ఈ వార్త విని కండోమ్స్ వాడేవాళ్లు దేవుడా..మనంగానీ అటువంటివే కొన్నామా ఏంటీ? అంటూ హడలిపోతున్నారు.


వాడి పారేసిన కండోమ్ లను సేకరించి వాటిని శుభ్రం చేసి మళ్లీ విక్రయిస్తోంది ఓ ముఠా. ఎంతో కాలంగా ఈ దందా సాగుతున్నప్పటికీ ఇటీవలే పోలీసులు ఈ దందాను బైటపడ్డారు. ఆ ముఠా నుంచి 3.45 లక్షల కండోములను స్వాధీనం చేసుకున్నారు.


వియత్నాంలోని బిన్ దువాంగ్‌లోని ఫ్యాక్టరీలో ఈ రకమైన వ్యాపారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. 3.2 లక్షల యూజ్డ్ కండోములను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సేకరించి ఫ్యాక్టరలో ‘శుభ్రంగా’ కడిగి రీప్యాక్ చేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దందా చేస్తున్న ఫ్యాక్టరీ యజమాని ఎవరో తెలుసుకుని మరింత షాక్ అయ్యారు పోలీసులు.


పామ్ తిన్ తాన్ గోక్ అనే మహిళ ఈ వ్యాపారం నిర్వహిస్తోందని తెలిసి ఓ మహిళ అయి ఉండి ఇటువంటి వ్యాపారం చేస్తోందా? అని ఆశ్చర్యపోయారు పోలీసులు. ఈమె కొంతమంది వర్కర్ల సాయంతో వాడేసిన కండోములను సేకరించి వాటిని కడిగి..ఆరబెట్టి..కర్రల సాయంతో సరైన ఆకారంలోకి అత్యంత చాకచక్యంగా మార్చి తిరిగి ప్యాక్ చేయిస్తోంది. వీటిని వాడిన వారికి సుఖరోగాలు, ఇతర వైరస్ సోకే ప్రమాదం ఉందని, ప్రజుల కండోమ్స్‌ను వాడే సమయంలో వాటి నాణ్యతను పరిశీలించాలని పోలీసులు కోరుతున్నారు.


ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. ఈమెకు సంబంధించిన ముఠా సభ్యులు తనకు కండోములను కేజీల లెక్కన అమ్ముతున్నారని కేజీకి 0.17 డాలర్లు తీసుకుంటున్నారని సదరు మహిళ చెప్పింది. ఈమెగారి వ్యాపార తెలివితేటలు వింటే పోలీసులకు కూడా దిమ్మతిరిగింది.

Related Posts