నయన్‌కు సామ్, విఘ్నేష్ విషెస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Happy Birthday Nayanthara: సౌతిండియా లేడీ సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు నేడు (నవంబర్ 18).. నేటితో 37వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారామె. నయన్ బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.
ప్రియుడు విఘ్నేష్ శివన్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


హ్యాపీ బర్త్‌డే లేడీ సూపర్‌స్టార్ నయనతార

హ్యపీ బర్త్‌డే బంగారం
నయన్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన విఘ్నేష్.. ‘హ్యపీ బర్త్‌డే తంగమే (బంగారం)’ అని కామెంట్ చేశాడు. ఎల్లప్పుడూ అదే స్ఫూర్తితో, అంకితభావంతో, నిజాయితీగా ఉండాలని ఆకాంక్షించాడు. అలాగే నయన్ ప్రధాన పాత్రలో తాను నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నెట్రికన్’ ట్రైలర్‌ రిలీజ్ చేశాడు విఘ్నేష్. నయన్ ఈ సినిమాలో అంధురాలిగా కనిపించబోతోంది.


వన్ అండ్ ఓన్లీ నయనతార
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని కూడా నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఒకే ఒక నయనతారకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నువ్వు మరింతగా వెలగాలి. మనదైన దాని కోసం పోరాడే స్ఫూర్తిని మాలాంటి వాళ్లకి కలిగించాలి. నీకు మరింత బలం చేకూరాలి. సిస్టర్.. నీ బలానికి, పట్టుదలకు సెల్యూట్’ అంటూ కామెంట్ చేసింది.


నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కబోయే ‘కాతు వాకులా రేండు కదల్ (Kaathu Vaakula Rendu Kadhal)’ అనే మూవీలో సమంత, నయనతార కలిసి నటించనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

Related Tags :

Related Posts :