F.E.A.R. భయానికి కొత్త అర్థం చెబుతున్న శీను..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘న‌కిలీ, డాక్ట‌ర్ సలీమ్‌, బిచ్చ‌గాడు, బేతాళుడు, రోషగాడు’ ఇలా ప‌లు చిత్రాల‌తో హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ హీరో విజ‌య్ ఆంటోని. ప్ర‌స్తుతం ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న ‘అగ్ని సిర‌గుగ‌ల్’ చిత్రాన్ని తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ అక్ష‌ర హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండగా నాజర్, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై జ‌వ్వాజి రామాంజ‌నేయులు ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్ చేసిన విజ‌య్ ఆంటోని అండ్ టీమ్ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యంతో ఉన్న ఫొటోను విడుద‌ల చేశారు.ఇందులో ఫియ‌ర్(ఎఫ్‌.ఇ.ఎ.ఆర్‌) అనే ప‌దం హైలెట్‌గా కనబడుతోంది. అన్నీ మ‌ర‌చిపోయి ప‌రిగెత్తాలా లేక స‌మ‌స్య‌ను ఎదుర్కొని నిల‌బ‌డాలా? అనే అర్థం వ‌చ్చేలా డిజైన్ చేయబడి ఉన్న తాను పోషిస్తున్న శీను పాత్ర గురించి తెలియ‌జేస్తూ ఈ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు విజ‌య్ ఆంటోని.

Related Posts