లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

విజయ్ దేవరకొండ న్యూ బిజినెస్!

Published

on

vijay-deverakonda-invests-in-watts-volts-mobility-private-limited

Vijay Deverakonda: టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ (Watts & Volts) మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. శుక్రవారం ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్‌లో వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ ప్రతినిధులు, హీరో విజయ్‌ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు.




ఈ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పర్యావరణ హితమైన ఈ స్కూటర్లు, బైక్‌లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బూ ఆదా అవుతాయి.

భవిష్యత్‌లో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని, ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ అలాగే వాట్స్ అండ్ వోల్ట్స్ ప్రతినిధులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.




Image

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *