అమ్మ కోసం విజయ్ ఏం ప్రామిస్ చేశాడో తెలుసా!..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Vijay Deverakonda Promised: క్రేజీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ తన తల్లి మాధవి దేవరకొండకు ఓ ప్రామిస్ చేశాడు. కొందరు స్టార్‌ హీరోలకు దక్కని అవకాశం అతి తక్కువ వ్యవధిలోనే సాధించి పాన్‌ ఇండియా లెవల్‌లో గుర్తింపు పొందాడు. బాలీవుడ్‌ హీరోయిన్లు సైతం.. విజయ్‌ దేవరకొండతో నటించాలని ఉందని చెప్పడం చూస్తుంటే.. తన క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


విజయ్‌ దేవరకొండ మదర్‌ మాధవి దేవరకొండ 50వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోలో మాధవి దేవరకొండ క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకుని షాట్‌ కొడుతుండగా.. పక్కన తన కుమారులు.. విజయ్‌, ఆనంద్‌లు కూడా షాట్‌ కొడుతున్నట్లుగా పోజిచ్చారు.


అనంతరం మాధవి దేవరకొండ 50 (50వ పుట్టినరోజు) కొట్టినట్లుగా బ్యాట్‌ని పైకి ఎత్తడంతో.. కుమారులు క్లాప్స్ కొట్టారు. ఈ వీడియో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ.. తన మదర్‌ని ఎప్పటికీ సంతోషంగా ఉంచుతానని చెబుతూ ప్రామిస్‌ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related Tags :

Related Posts :