Home » హైదరాబాద్ వరదలపై స్పందించిన విజయ్ దేవరకొండ
Published
3 months agoon
By
sekharHyderabad Rains: హైదరాబాద్‌లో గతకొద్దిరోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వర్షపు నీటితో ఏర్పడ్డ వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు వర్షాలు పడతాయనే సమాచారంతో భాగ్యనగరవాసులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో Hyderabad Floods పై యువ హీరో Vijay Deverakonda స్పందించాడు. ప్రస్తుతం యూరప్‌లో ఉన్న విజయ్ నగర పరిస్థితిని తెలుసుకుని సోషల్ మీడియా ద్వారా తన స్పందన తెలియచేశాడు.
‘‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది.. కష్టాల్లో ఉన్నవారి కోసం ప్రార్థిస్తున్నా..త్వరలోనే ఇంటికి తిరిగి వస్తా.. అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ.
Hyderabad ❤️
Sad to be away at this hour, but thinking about all of you and praying for everyone.
Looking forward to returning home soon.
Sending my Love and Strength,
Vijay— Vijay Deverakonda (@TheDeverakonda) October 18, 2020