Home » ‘లూసిఫర్’ రీమేక్‌లో ‘లైగర్’!
Published
1 month agoon
Vijay Deverakonda: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152 వ సినిమా ‘ఆచార్య’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు బాస్ 153 వ సినిమాగా మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ తెరకెక్కనుంది. ఎన్‌ఆర్‌వి సినిమాస్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లపై సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎ.మోహన్ రాజా (జయం రాజా) ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్ పనులతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక వంటివి చకచకా జరుగుతున్నాయి. జనవరి 21 న పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉంటే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో టాలీవుడ్ క్రేజీ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడంటూ ఫిలిం వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే కనుక నిజమైతే ఇప్పటివరకు ఏ యంగ్ హీరోకి దొరకని లక్కీ ఛాన్స్ విజయ్‌కి దొరికినట్లే అని చెప్పొచ్చు. ఈ న్యూస్ వినడానికైతే బాగుంది కానీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.