లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి కంటతడి పెట్టిన చార్మీ..

Published

on

LIGER CRAZE: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రానున్న పాన్ ఇండియా మూవీకి ‘లైగర్’ టైటిల్, ఫస్ట్ లుక్ సోమవారం రిలీజ్ చేశారు. ‘లైగర్’ అనే డిఫరెంట్ పేరుకి ‘సాలా క్రాస్ బీడ్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ పెట్టారు.. పూరి సినిమా టైటిల్స్, హీరో క్యారక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. అదే స్థాయిలో టైటిల్, ట్యాగ్ లైన్, ఫస్ట్ లుక్ ఉండడంతో వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ‘లైగర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొద్దిసేపటికే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కటౌట్స్ ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేశారు. కేక్స్ కట్స్ చేశారు.. డబ్బులతో సినిమా రిలీజ్‌ని తలపించారు. అలాగే విజయ్ వీరాభిమానులు తమ చేతులమీద ‘లైగర్’ పేరుని టాటూగా వేయించుకున్నారు. ఈ వీడియో షేర్ చేస్తూ కళ్లవెంట నీళ్లు వచ్చాయంటూ చార్మీ చెప్పారు.

యూత్‌లో టాలీవుడ్ రౌడీస్టార్ క్రేజ్ ఎలా ఉందనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.. ఈ సినిమా కోసం విజయ్ ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.. విజయ్ పక్కన బాలీవుడ్ భామ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. ధర్మా ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.