లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘సలార్’ లో సేతుపతి.. ఓకే అంటారా.. సారీ బాస్ అంటారా!

Published

on

Vijay Sethupathi: అసలు హీరో ఎలిమెంట్స్ ఉన్నా కూడా, హీరోగా క్రేజ్ కంటిన్యూ అవుతున్నా.. విలన్‌గానే ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతున్నారు. అంతేకాదు.. అటు తమిళ్, ఇటు తెలుగులో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా బిజీ అవుతున్నారు. డేట్స్ లేవని ఆమిర్ ఖాన్, కమల్ హాసన్ సినిమాల్ని సైతం వదులుకున్న విజయ్ సేతుపతి, ప్రభాస్ సినిమాలో విలన్‌గా వచ్చిన ఆఫర్‌కి ఓకే చెప్తారా..? సారీ బాస్ అంటారా..?

హీరోగానే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ఇప్పుడు సౌత్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అయ్యారు. అందుకే వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. హీరోగా కాదు.. విలన్‌గా.. మెగాస్టార్ ‘సైరా’ లో పాండిరాజ్ క్యారెక్టర్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సేతుపతి ‘ఉప్పెన’ సినిమాతో విలన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఎక్కువగా విలన్‌గానే అవకాశాలు అందుకుంటున్నారు. లేటెస్ట్‌గా ప్రభాస్ సినిమాలో కూడా విలన్‌ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతి వైపు చూస్తున్నారు మేకర్స్.

‘ఉప్పెన’ సినిమాతో పాటు సుకుమార్ ‘పుష్ప’ సినిమాలో కూడా విజయ్ సేతుపతినే విలన్‌‌గా అనుకున్నారు. కానీ డేట్స్ ఇష్యూతో ‘పుష్ప’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. అంతేకాదు మరికొన్ని హ్యాపెనింగ్ తెలుగు సినిమాల్లో విలన్‌గా విజయ్ సేతుపతినే అనుకుంటున్నారు మేకర్స్. ఎందుకంటే.. తమిళ్ ‘మాస్టర్’ లో విజయ్‌కి విలన్‌‌గా విజయ్ సేతుపతి యాక్టింగ్‌కి ఫిదా అయిపోయారు ఫ్యాన్స్.

లేటెస్ట్‌గా ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాకు కూడా విజయ్ సేతుపతినే ఫిక్స్ చేద్దామనుకుంటున్నారు మేకర్స్. విజయ్ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడంతో అటు సౌత్‌తో పాటు నార్త్ మార్కెట్‌ని కూడా గ్రాబ్ చేస్తాడని లెక్కలేసుకుంటున్నారు టీమ్. అయితే ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేక కమల్ హాసన్ ‘భారతీయుడు 2’, ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో పాటు ఇంకా చాలా సినిమాలు డ్రాప్ అయ్యారు. మరి ప్రభాస్‌ సినిమాలో వచ్చిన ఈ ఆఫర్‌కి అయినా విజయ్ సేతుపతి ఓకే అంటారా లేక సారీ బాస్ అని సింపుల్‌గా తప్పుకుంటారా అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్.