లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్’..

Published

on

Vijaya Krishna Green Studios: నటశేఖర, సూపర్‌‌స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో నిర్మాణ సంస్థ రాబోతోంది. ఇప్పటికే కృష్ణ తన సోదరులు హనుమంత రావు, ఆదిశేష గిరి రావులతో కలిసి స్థాపించిన పద్మాలయా స్టూడియోస్‌, సూపర్‌ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు స్థాపించిన కృష్ణా ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌, కృష్ణ తనయ మంజుల స్థాపించిన ఇందిర ప్రొడక్షన్స్, మహేష్‌ బాబు పేరుతో ఉన్న ఘట్టమనేని మహేష్‌ బాబు (జిఎమ్‌బి) ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధీర్‌ బాబు స్థాపించిన సుధీర్ బాబు ప్రొడక్షన్స్ వంటి బ్యానర్లు ఆ ఫ్యామిలీలో ఉన్నాయి.

అయితే వీటిలో జిఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సుధీర్‌ బాబు స్థాపించిన సుధీర్‌ బాబు ప్రొడక్షన్స్‌ మాత్రమే ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా డాక్టర్ నరేష్, మరియు సూపర్ స్టార్ కృష్ణ మనవడు నవీన్ విజయ కృష్ణ కలిసి ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

1972లో కృష్ణ, విజయ నిర్మల కలిసి స్థాపించిన విజయ కృష్ణ మూవీస్ సంస్థనే ఇప్పుడు నరేష్‌, నవీన్‌ విజయ కృష్ణలు ‘విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్’ పేరుతో రీ లాంచ్‌ చేశారు. విజయ కృష్ణ మూవీస్ సంస్థలో, విజయ నిర్మల దర్శకత్వంలో ‘మీనా, హేమా హేమీలు, అంతంకాదిది ఆరంభం..’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. అదే సమయంలో విమర్శకుల ప్రశంసలు పొందిన పలు చిత్రాల ద్వారా తొలి మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. స్టూడియోతో పాటు డబ్బింగ్ స్టూడియో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్టూడియో, ఎడిట్ సూట్స్ మరియు ఔట్ డోర్ యూనిట్స్‌ను స్థాపించారు.

ఇక తాజాగా రీ లాంచ్ అయిన విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ కార్యాలయానికి సూపర్ స్టార్ కృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా.. హీరో సుధీర్ బాబు ఛైర్మెన్ ఛాంబర్, కాన్ఫిరెన్స్ హాల్‌ను ప్రారంభించారు. సూపర్‌ స్టార్‌ కృష్ణ భార్య దివంగత దర్శకురాలు విజయనిర్మల తమ్ముళ్లు రవికుమార్, రామనాధ్‌లు.. అడ్మిన్ మరియు రిసెప్షన్ బ్లాక్స్‌ను ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ నవీన్ విజయ కృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ నరేష్ విజయ కృష్ణ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.

ImageImageImage

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *