VIJAYA SANTHI words sarileru neekevvaru pre release event

మహేశ్ షూటింగ్‌లో రెచ్చిపోయాడు: విజయశాంతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ఫుల్ జోష్‌తో జరిగింది. లేడీ సూపర్ స్టార్.. విశ్వ నట భారతి విజయశాంతి అదే అగ్రెసివ్‌నెస్ తో మాట్లాడారు. సినిమా యూనిట్ కు విషెస్ చెబుతూనే మెగాస్టార్ మీద సరదాగా సెటైర్లు వేశారు. 

* భయపడకండి. రేపటి జీవితం మీదే. నా అక్కాచెల్లెళ్ల కోసం పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. 
* తెలుగు సినిమా ఇండస్ట్రీకి నన్నుపరిచయంచేసింది కృష్ణా గారూ. నా సక్సెస్ ఫుల్ హీరో ఆయనే. 
* రీ ఎంట్రీ మహేశ్ బాబుతో అవడం ఆశ్చర్యంగా ఉంది. పట్టుకుంటే కందిపోయాలా ఉంటాడు. అతను జెంటిల్ మాన్. 
* కొత్త దనం కోసం ప్రతి సినిమాలో ప్రయత్నిస్తూనే ఉంటాడు. మహేశ్ బాబే చేశాడా అని కూడా డౌట్ వస్తుంది. 
* డ్యాన్స్ విషయంలో రెచ్చిపోయాడు. మహేశ్.. నా కాంబినేషన్ సీన్స్ లో చాలా బాగా వచ్చాయి. 
* వెయ్యి మంది ఆడబిడ్డలకు గుండె ఆపరేషన్లు చేయించారు. అలాంటి పెద్ద పనులు చేసే ఆయన బయట కూడా సూపర్ స్టార్. 

చిరంజీవి నేనూ కలిసిచాలా బ్లాక్ బాస్టర్ సినిమాలు తీశాం. ఈ సినిమా కోసం మమ్మల్ని దీవించడానికి ఆయన వచ్చారు. మాకు చాలా గుర్తొస్తున్నాయి. థ్యాంక్యూ హీరో గారూ. అంటూ నవ్వులు కురిపించారు. 

Related Posts