Vijayam Video Song Special Cut Dedicated to POWER STAR Pawan Kalyan from George Reddy

‘విజయం’ సాంగ్ స్పెషల్ కట్ – పవన్‌కు అంకితం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్).. మూవీలోని ‘విజయం’ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అంకితమిస్తూ స్పెషల్‌ కట్ విడుదల చేశారు..

నవ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్).. జార్జ్ రెడ్డి ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి టెర్రిఫిక్ లీడర్ గురించి ఈ తరం తెలుసుకునేలా ‘జార్జ్ రెడ్డి’.. సినిమాను రూపొందించారు.

సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మించగా, ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలోని ‘సమరం మనది అయితే.. విజయం మనదే కదా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అంకితమిస్తూ స్పెషల్‌ కట్ విడుదల చేశారు.

Read Also : ‘అఖియా మిలావాంగా’ వీడియో సాంగ్ : కమాండో 3

పవన్ పొలిటికల్ యాంగిల్‌లో ఈ పాటను రూపొందించారు. సురేష్ బొబ్బిలి ట్యూన్ కంపోజ్ చేయగా, మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి పాడారు. ‘వంగవీటి’ మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్.. జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌ చేయగా.. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి, శత్రు తదితరులు ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. నవంబర్ 22న ‘జార్జ్ రెడ్డి’ రిలీజ్ కానుంది. కెమెరా : సుధాకర్ యెక్కంటి, సంగీతం : సురేష్ బొబ్బిలి, బ్యాగ్రౌండ్ స్కోర్ : హర్ష వర్ధన్ రామేశ్వర్, సహ నిర్మాత : సంజయ్ రెడ్డి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ : దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి.

Related Tags :

Related Posts :