పోలవరానికి ప్రధాన అడ్డంకి చంద్రబాబే, వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం సబబే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

vijayasai reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారని అన్నారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డండి చంద్రబాబే అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పోలవరానికి వ్యతిరేకంగా ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాలతో చంద్రబాబు కేసులు వేయించలేదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ అని చెప్పిన విజయసాయిరెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టడం సమంజసమే అన్నారు.

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పైనా విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేశ్ చంద్రబాబు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని విజయసాయిరెడ్డి చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో వ్యాపారాలు చేయనని తేల్చి చెప్పారు. తన పేరు ఎవరైనా ఉపయోగిస్తే కేసులు పెడతానన్నారు. పొరుగు రాష్ట్రంలో ఉండి రాజకీయం చేసే ఎన్నారై పార్టీ టీడీపీ అని విజయసాయిరెడ్డి అన్నారు.

విశాఖ ఎయిర్ పోర్టు నేవీది అని చెప్పిన విజయసాయిరెడ్డి అక్కడ నైట్ ల్యాండింగ్ కు సమస్యలు ఉన్నాయని తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు పూర్తయ్యాక విశాఖ ఎయిర్ పోర్టును నేవీకి అప్పగిస్తామన్నారు. సీఎం జగన్ త్వరలోనే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు.

Related Tags :

Related Posts :