లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

కాంగ్రెస్ కు విజయశాంతి గుడ్ బై

Published

on

Vijayashanti goodbye to Congress : గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2020, నవంబర్ 24వ తేదీ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న విజయశాంతి..త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి బీజేపీలో చేరబోతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బీజేపీ తరపున విజయశాంతి ప్రచారం నిర్వహించనున్నారు.పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈమె బీజేపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కొన్ని వారాల క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి… విజయశాంతి నివాసానికి వెళ్లి స్వయంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాణిక్యం ఠాగూర్ స్వయంగా విజయశాంతి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె మెత్తబడలేదు.ఇటీవల కాంగ్రెస్ పార్టీకి షాక్‌లపై షాక్‌లు తగులుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల ముంగిట… మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఫ్యామిలీ… కాంగ్రెస్ కు గుడ్‌బై చెప్పాయి. తాజాగా విజయశాంతి కూడా కమలం గూటికి చేరాలని నిర్ణయించుకోవడంతో…కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గ్రేటర్‌ ఎన్నికల్లో నైనా… పరువు కాపాడుకోవాలనుకున్న హస్తం పార్టీకి…ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.


గ్రేటర్ ఓటర్ తిరగబడుతున్నాడు, నేతలను నిలదీస్తున్నాడు


కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న విజయశాంతి.. ఇటీవలి కాలంలో ఆ పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక హోరాహోరీగా జరిగినా…ప్రచార కమిటీకి బాధ్యురాలై ఉండి కూడా.. అటు వైపు కన్నెత్తి చూడలేదు. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్‌ను గెలిపించమని ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కూడా విజయశాంతి ఖండించారు. వెంటనే అలర్టైన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం.. రాములమ్మను నిలుపుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేసింది.అయితే..విజయశాంతి నుంచి మాత్రం ఎలాంటి సిగ్నల్ రాలేదు. దీంతో.. ఆవిడ ఉద్దేశమేంటో తెలుసుకునేందుకు.. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణికం ఠాగూర్.. నేరుగా ఇంటికెళ్లి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో.. తాను ఎందుకు పార్టీ వీడాల్సి వస్తుంది? బీజేపీలో చేరడానికి గల కారణాలను వివరించారని సమాచారం.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *