vijayawada police have seized a large amount of cash from omni van 

విజయవాడలో భారీగా పట్టుబడ్డ నగదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విజయవాడ గవర్నర్ పేటలో  పోలీసులు భారీగా నగదు పట్టుకున్నారు.  చల్లపల్లి బంగ్లా  సమీపంలో మారుతీ  ఓమ్ని వ్యాన్ లో  ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 70 లక్షలని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.  నగరంలో తనిఖీల్లో భాగంగా గవర్నర్ పేట సీఐ నాగరాజు తన సిబ్బంది  వాహన తనిఖీ చేస్తుండగా మారుతీ వ్యాన్ అనుమానాస్పదంగా వెళుతోంది.  ఈ క్రమంలో దానిని తనిఖి చేయగా బ్యాగ్ లో ఉంచిన రూ.70 లక్షల నగదు స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నగదును  ఆదాయపన్ను శాఖ అధికారులకి అప్పగించారు.

Read: ఏపీలో ఆ ప్రాంతాలు మళ్లీ లాక్ డౌన్‌లోకి..

Related Posts