విచారణలో సంచలన నిజాలు…గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే నెల సంపాదన ఎంతో తెలుసా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్‌లు, మర్డర్‌ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ను జూలై 10న ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. వికాస్ దుబే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఈ కేసులో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఈడీ విచారణ కొనసాగిస్తునే ఉంది. ఈ విచారణలో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వికాస్ దుబే నెలకు కోటి రూపాయల వరకు సంపాదించే వాడు అని విచారణలో తేలినట్లు సమాచారం. అయితే ఇలా వచ్చిన భారీ సొమ్మును దూబే ఎలా ఖర్చు చేసేవాడు అన్నదానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి తాగుడు అలవాటు లేని వికాస్ దూబే ఒక సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వాడట. ఆడంబరమైన దుస్తులను కూడా ధరించేవాడు కాదు.

అంతేకాకుండా విదేశీ ప్రయాణాలకు కూడా దూరంగా ఉండేవాడట. ఇలా అన్ని రకాలుగా చూసిన దుబే అంత డబ్బును ఖర్చు చేయలేడు. మరి ఆ డబ్బంతా ఏమైనట్టు అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

ప్రస్తుతం వికాస్ బ్యాంకు ఖాతాను గమనించగా అందులో ఎక్కువ మొత్తంలో సొమ్ము లేనట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే సన్నిహితులు బంధువుల బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు, ప్రతినెల భారీ డబ్బులు వస్తున్న నేపథ్యంలో దూబే డబ్బులను ఏదైనా వ్యాపారం కోసం వినియోగించాడా అన్నదానిపై కూడా ప్రస్తుతం కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ప్రతి నెల 90 లక్షల నుంచి 1.2 కోట్ల వరకు సంపాదించే దుబే, ఆ డబ్బును ఏం చేస్తున్నారో తెలియాలంటే ఈడీ విచారణ పూర్తవ్వాల్సిందే.

Related Posts