ఊరి పోరగాళ్ల వాటర్ స్టైడ్ చూడండీ..వాననీటిలో జర్రున జారుతూ ఆటలే ఆటలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సాధారణంగా వాటర్ స్లైడ్‌లో పెద్ద పెద్ద పార్కుల్లోను..రిసార్ట్స్ లోను ఉంటాయి. కానీ వానలు కురి వాగులు..వంకలు పొంగుతూ కొత్త నీటితో చక్కగా జలకళతో ఉట్టిపడుతున్నాయి. కొత్త నీరు వచ్చిందంటే చాలు గ్రామాల్లో పిల్లలు కాలువల్లో చెరువుల్లో ఊతలు కొడుతూ స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ సరదాయే వేరు..గట్టుమీదనుంచి దూకుతూ..కేరింతలతో..ఈలలతో సందడి సందడి చేస్తూ పిల్లకాయలు స్నానాలు చేస్తుంటారు.

గ్రామాల్లో వర్షాలు వచ్చాయంటే చాలు ప్రకృతి అందాలు వెల్లివిరుస్తాయి. చక్కగా వర్షాలు పడటంతో ఓ గ్రామంలో చిన్నారులు ఏకంగా వాటర్ స్లైడ్ తయారు చేసేసుకున్నారు. వర్షపు నీటికి మట్టి మెత్తగా మారింది. దాన్ని నున్నగా చేసి జారుడు బల్లలాగా అంటే వాటర్ స్లైడ్ లా తయారు చేసుకుని జర్రున జారుతూ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.

దూరంగా వెళ్లి పరుగెత్తుకుంటూ వచ్చి ఆ జారుడు బల్లలాంటి మట్టిమీద నుంచి నీటిలోకి జారుతూ భలే ఎంజాయ్ చేశారు. ఆనందంగా ఉన్నంత సేపు పరవాలేదు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆర్టిఫిషియల్ వాటర్ స్లైడ్ వద్ద నీళ్లు నిశ్చలంగా తక్కువ లోతు ఉంటాయి. కానీ..ఈ చిన్నారులు ఆడుతున్నది నదీ తీరంలో. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం తేడా వచ్చినా నదిలో కొట్టుకుపోయే ప్రమాదముంది. ఏది ఏమైనా తాము ఉన్నచోటే ఎంజాయ్ చేయటం ఊరి పిల్లకాలకు తెలిసున్నంతగా ఎవ్వరికీ తెలీదేమో..వారి ఆనందం చూస్తుంటే మనకు కూడా అలా జర్రున జారుతూ ఎంజాయ్ చేయాలనిపించకమానదు.

Related Posts