అల్లర్లు సృష్టించిన సోషల్ మీడియా పోస్ట్ … ఇద్దరు మృతి, 110 మంది అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్టు బెంగుళూరు నగరంలో బీభత్సం సృష్టించింది. అల్లరి మూకలను అదుపుచేయటానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఇద్దరు మరణించగా 110 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఒక ఎమ్మెల్యే ఇంటి వద్ద ఈ గోడవ జరగటంతో హోంమంత్రి విచారణకు ఆదేశించారు.

కర్ణాటక రాజధాని బెంగుళూరులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి ఇంటిపై కొందరు పౌరులు మంగళవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్దలానికి చేరుకున్న పోలీసులు దాడి చేస్తున్న వారిని అదుపు చేయటం కోసం లాఠీ చార్జీ చేశారు. అయినా వారు వెనకడుగు వెయ్యక పోగా పోలీసులపై రాళ్ళదాడి చేశారు.

అల్లరిమూకలు అక్కడ ఉన్న వాహానాన్ని తగల బెట్టారు. దీంతో పోలీసులు పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు వ్యక్తిలు మరణించారు. అనంతరం అల్లరిమూకలు బెంగుళూరు తూర్పులోని కేజే హాళ్ళి పోలీసు స్టేషన్ పై దాడికి యత్నించింది. పోలీసులు వారినీ చెదర గొట్టారు.

ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి మేనల్లుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టును వ్యతిరేకిస్తూ వీరు దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈవిషయమై దర్యాప్తు చేయాలని హోం మంత్రి బసవరాజ్ బొమ్మయ్ అధికారులను ఆదేశించారు.

 

Related Posts