Home » హింస పరిష్కారం కాదు : రాజధానిలో రగులుతున్న రైతులకు రాహుల్ విజ్ణప్తి
Published
1 month agoon
Rahul Gandhi On Farmers’ Protest ఢిల్లీలో రైతుల ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సాగు చట్టాల వ్యతిరేకంగా 60రోజులుగా రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దుతు ఇస్తోన్న రాహ:ేల్ తాజాగా ఇవాళ ఢిల్లీలో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలవైపు మళ్లడాన్ని తప్పుబట్టారు. ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదని రాహుల్ తెలిపారు.
ఎవరు గాయపడ్డారనేదితో సంబంధం లేకుంటా..దేశం బాధపడుతోందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశ హితం కోసం అగ్రి చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రానికి రాహుల్ సూచించారు. కాగా, ఇవాళ మధ్యాహ్నాం చట్టాలను వ్యతిరేకిస్తూ ట్రాక్టర్ ర్యాలీ తీసిన రైతులు ఢిల్లీ నగరంలోకి దూసుకువెళ్లారు. ముందుగా నిర్ణయించిన మార్గాల నుంచి కాకుండా వేలాది మంది రైతులు పక్కదోవపట్టారు. పెద్ద సంఖ్యలో రైతులు నినాదాలే చేస్తూ ట్రాక్టర్లతో బారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించారు. వందలమంది రైతులు ఎర్రకోటపైకి చేరుకొని రైతుల జెండాను ఎగురవేశారు.
మంగళవారం ఉదయాన్నే పోలీసులు పెట్టిన బారికేడ్లను తొలగించి వేలాది మంది రైతులు ఢిల్లీలోకి ప్రవేశించారు. నగరంలోకి దూసుకువచ్చిన రైతులను పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై లాఠీచార్జ్ చేశారు..టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిజానికి రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత రైతులు తమ ట్రాక్టర్ పరేడ్ చేపట్టడానికి అనుమతి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉదయం 8 గంటలకే సరిహద్దులు దాటి ఢిల్లీలోకి దూసుకువచ్చారు.కనిపించిన పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు.
పాండవ్ నగర్ దగ్గర్లో ఢిల్లీ, మీరట్ ఎక్స్‌ప్రెస్ వేపై పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను రైతులు తొలగించారు. అటు ముకర్బా చౌక్‌లోనూ బారికేడ్లను తొలగించి పోలీసుల వాహనంపై ఎక్కారు. సంజయ్‌గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్లోనూ పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. దేశరాజధానిలోని పలు చోట్ల తమపై లాఠీ ఝలిపించిన పోలీసులపై రైతులు కూడా తిరగబడ్డారు. పలు చోట్ల ఆందోళనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడ్డారు. అయితే,పోలీసుల కాల్పుల్లో ఓ రైతు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.