లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

కమలంలో కుమ్ములాటలు: గ్రేటర్‌లో టికెట్ల లొల్లి.. కొట్టుకున్న కార్యకర్తలు

Published

on

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఏడవ జాబితా విడులైన తర్వాత మరోసారి ఆ పార్టీలో కమ్ములాటలు జరిగాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాబితాను విడుదల చేసిన తర్వాత.. కాషాయ పార్టీ టికెట్ ఆశించి దక్కని వారు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే గన్‌ఫౌండ్రీ టికెట్‌ను సురేఖ ఓంప్రకాష్‌‌కు ఇవ్వగా.. ఆ పార్టీ గన్‌ఫౌండ్రీ టికెట్ ఆశించిన శైలేందర్ యాదవ్.. రాష్ట్ర కార్యాలయానికి వచ్చి అనుచరులతో కలిసి గందరగోళం క్రియేట్ చేశారు.బీజేపీ నేతలు టిక్కట్లు అమ్ముకున్నారంటూ లొల్లి చేస్తున్నారు. బీజేపీలో అసంతృప్తి నేతలు తారాస్థాయికి చేరుకోగా.. మొన్న కూకట్ పల్లి, నిన్న కుత్బుల్లాపూర్, నేడు గన్‌ఫౌండ్రీ నేతలు అధిష్టానంపై తిరుగుబాటు భావుటా ఎగురవేశారు. పార్టీలో కొత్తగా వచ్చినవారికే టిక్కెట్లు ఇస్తున్నారంటూ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గొడవలు జరుగుతుండగా.. ఇప్పుడు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో గన్‌ఫౌండ్రికి చెందిన రెండు వర్గాల కార్యకర్తలు కొట్టుకున్నారు.కార్యాలయంలోని కుర్చీలు విసురుకున్నారు. గన్‌ఫౌండ్రి నుంచి ఓంప్రకాశ్‌కు బీజేపీ టికెట్‌ ఖరారు చేయగా.. బీఫామ్‌ తీసుకునేందుకు ఓంప్రకాశ్‌ అనుచరులతో కలిసి కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో శైలేందర్‌ యాదవ్ వర్గీయులు ఓంప్రకాశ్‌ను అడ్డుకుని బీఫాం లాక్కునేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఓంప్రకాశ్‌ ఇటీవల టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. ముందు నుంచీ పార్టీలో ఉన్న వారికి టికెట్‌ ఇవ్వలేదని శైలేందర్‌ వర్గీయుల వాదన. నాలుగు నెలల్లో వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చినట్లుగా వారు ఆగ్రహం వ్యక్తంఅయితే మరోవైపు తాను గెలవడానికి అన్నీ అవకాశాలు ఉన్నాయని, అందరూ కూడా గెలుపు కోసం పని చేస్తారని, అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించరు అని ఓంప్రకాష్ అన్నారు. రాష్ట్రకార్యాలయంలో ఫర్నీచర్‌ను ద్వంసం చెయ్యడంతో శైలేందర్ యాదవ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *